Last Updated:
Sri Maridamma Ammavari Jatara: కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని గురించే అందరికి తెలుసు. కాని ఏటా జరిగే గ్రామదేవత శ్రీమరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసంవత్సరం సోమవారం జులై 14న అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది.
Sri Maridamma Ammavari Jatara 2026: తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతానికో సాంప్రదాయం, ఆచార, వ్యవహారాలు కొనసాగుతాయి. మరీ ముఖ్యంగా భక్తి విషయంలో ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసం వారిది. అయితే ఆధ్యాత్మిక విషయంలో తెలుగువాళ్లు ప్రతీ దేవతను, దేవుడ్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని గురించే అందరికి తెలుసు. కాని ఏటా జరిగే గ్రామదేవత శ్రీమరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈసంవత్సరం సోమవారం జులై 14న అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది. వివిధ దేవతామూర్తుల వేషధారణలతో గ్రామస్తులంతా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలతో బళ్ళవేషాలు, బ్యాండ్ మేళం, కోయ వేషధారణలు, విచిత్ర వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామసంబురంగా జరుపుకున్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం గ్రామ దేవత శ్రీమరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం అమ్మవారి సంబరం వైభవంగా జరిగింది. వివిధ దేవతామూర్తుల వేషధారణలతో గ్రామమంతా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. దేవతామూర్తుల వేషధారణలతో బళ్లవేషాలు, బ్యాండ్ మేళం, కోయ వేషధారణలు, విచిత్ర వేషాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి.
ఈసంబరాలలో మరిడమ్మతల్లి వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. నిండైన రూపంతో అమ్మవారి వేషధారణ ఈ జాతరలో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. వివిధ దేవతలు, రాక్షసులు, హాస్యకారులు, బ్యాండ్ మేళాలు, డీజే నృత్యాలతో ఆద్యంతం జాతర మహోత్సవాల ఊరేగింపు గ్రామమంతా అత్యంత వైభవంగా సాగింది. ఊరేగింపు తిలకించుటకు జనం రోడ్లకిరువైపులా గుమికూడటంతో రోడ్లు జనసంద్రంగా మారాయి. అమ్మవారి ఆలయంతో పాటు రైల్వేస్టేషన్ రోడ్డు నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక విధ్యుత్ అలంకరణ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఊరేగింపు అనంతరం రాత్రి ఆలయం వద్ద అమ్మవారికి కుంభం నివేధించి కవాటబంధనం గావించారు. టీవీ ఆర్టిస్టులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మరిడమ్మతల్లి జాతర మహోత్సవాలలో భాగంగా రాత్రి ఆలయకమిటీ ఆద్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలు వీక్షకులకు కనువిందు చేసాయి.
Hyderabad,Telangana
