ప్రభన్యూస్

SP vs Congress: ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల చిచ్చు.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన సమాజ్‌వాదీ పార్టీ! |


Last Updated:

SP vs Congress: 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఇండియా’ (INDIA) కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తారస్థాయికి చేరాయి.

అఖిలేశ్, రాహుల్ గాంధీ
అఖిలేశ్, రాహుల్ గాంధీ

మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన రెండో దశ చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఈ సందర్భంగా గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సీట్ల పంపకాల ఫార్ములాను ప్రస్తావించిన సమాజ్‌వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో ఆ ‘బిహార్ ఫార్ములా’ను ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం చేయబోమని తేల్చిచెప్పింది.

బిహార్ ఫార్ములా వద్దు.. స్ట్రైక్ రేటే ముఖ్యం

బిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం కూటమి చేసిన పెద్ద తప్పిదమని, ఇతర భాగస్వామ్య పక్షాలతో పోలిస్తే అక్కడ కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ (గెలుపు శాతం) చాలా తక్కువగా నమోదైందని ఎస్పీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అందువల్ల యూపీలో కూడా కాంగ్రెస్ చేస్తున్న భారీ సీట్ల డిమాండ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేసింది.

26 సీట్లు వర్సెస్ 100కి పైగా స్థానాలు

ఇండియా కూటమి వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన రెండో దశ చర్చల్లో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తొలుత సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్ చేయగా, ఆ తర్వాత కాంగ్రెస్ అదనంగా కొన్ని పరిమిత సీట్లు మాత్రమే అడుగుతుందని ఎస్పీ భావించింది. కానీ సమావేశం చివరిలో కాంగ్రెస్ మరోసారి తాము పోటీ చేయాలనుకుంటున్న 100కి పైగా స్థానాల జాబితాను ఎస్పీ చేతిలో పెట్టింది. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న భారీ అంతరం మరోసారి బయటపడింది.

కేవలం సీట్ల సంఖ్యను డిమాండ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అభ్యర్థుల గెలుపు అవకాశాలు (విన్నబిలిటీ), గత ఎన్నికల పనితీరు, క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలని ఎస్పీ తేల్చిచెప్పింది. అంతేకాకుండా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఎలాంటి రాజీ పడబోమని, కాంగ్రెస్ కోరుతున్న నియోజకవర్గాల్లో వారి అభ్యర్థుల పేర్లను ముందుగా చెప్పాలని ఎస్పీ పట్టుబట్టింది.

కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతూ 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన

చర్చలు కొలిక్కి రాకముందే సమాజ్‌వాదీ పార్టీ తన మిత్రపక్షంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి తెరలేపింది. 2027 ఎన్నికలకు గానూ ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎస్పీ విడుదల చేసింది. ఇందులో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బెహాట్ నుంచి ఉమర్ అలీ ఖాన్, సహరాన్‌పూర్ నుంచి ఆశు మాలిక్ పేర్లను ప్రకటించింది. ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్ పార్టీతో పాటు సహరాన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఎప్పటినుంచో కన్నేసి ఉంచారు.

అఖిలేశ్ యాదవ్ ట్వీట్.. ‘పీడీఏ’ అభ్యర్థులుగా బరిలోకి

మరోవైపు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు కీలక సందేశం పంపారు. పట్టుదలకు పోయి సీట్ల సంఖ్యపై కాకుండా, పరస్పర సర్దుబాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. కూటమి తరఫున బరిలోకి దిగే ఉమ్మడి అభ్యర్థులందరినీ ‘పీడీఏ (PDA) అభ్యర్థులు’గా నిలబెట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే చర్చించిన 26 సీట్లకు అదనంగా తమకు బలమైన గెలుపు అవకాశాలున్న మరికొన్ని నియోజకవర్గాల జాబితాను పంపాలని కాంగ్రెస్‌ను కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 10:12 am Digital Edition : Prabhanews
SP vs Congress: ఎన్నికల వేళ ఇండియా కూటమిలో సీట్ల చిచ్చు.. కాంగ్రెస్‌కు షాకిచ్చిన సమాజ్‌వాదీ పార్టీ! |

Last Updated:November 25, 2026 10:00 AM ISTSP vs Congress: 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘ఇండియా’ (INDIA) కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై విభేదాలు తారస్థాయికి చేరాయి.అఖిలేశ్, రాహుల్ గాంధీమంగళవారం న్యూఢిల్లీలో జరిగిన రెండో దశ చర్చలు ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిశాయి. ఈ సందర్భంగా గత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ–కాంగ్రెస్ సీట్ల పంపకాల ఫార్ములాను ప్రస్తావించిన సమాజ్‌వాదీ పార్టీ, ఉత్తరప్రదేశ్‌లో ఆ ‘బిహార్ ఫార్ములా’ను ఎట్టిపరిస్థితుల్లోనూ పునరావృతం చేయబోమని తేల్చిచెప్పింది.బిహార్ ఫార్ములా వద్దు.. స్ట్రైక్ రేటే ముఖ్యంబిహార్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 సీట్లు కేటాయించడం కూటమి చేసిన పెద్ద తప్పిదమని, ఇతర భాగస్వామ్య పక్షాలతో పోలిస్తే అక్కడ కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ (గెలుపు శాతం) చాలా తక్కువగా నమోదైందని ఎస్పీ నాయకత్వం అభిప్రాయపడుతోంది. అందువల్ల యూపీలో కూడా కాంగ్రెస్ చేస్తున్న భారీ సీట్ల డిమాండ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని ఎస్పీ స్పష్టం చేసింది.26 సీట్లు వర్సెస్ 100కి పైగా స్థానాలుఇండియా కూటమి వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం దాదాపు మూడు గంటల పాటు జరిగిన రెండో దశ చర్చల్లో ఇరు పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. తొలుత సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్ చేయగా, ఆ తర్వాత కాంగ్రెస్ అదనంగా కొన్ని పరిమిత సీట్లు మాత్రమే అడుగుతుందని ఎస్పీ భావించింది. కానీ సమావేశం చివరిలో కాంగ్రెస్ మరోసారి తాము పోటీ చేయాలనుకుంటున్న 100కి పైగా స్థానాల జాబితాను ఎస్పీ చేతిలో పెట్టింది. దీంతో ఇరు పార్టీల మధ్య ఉన్న భారీ అంతరం మరోసారి బయటపడింది.కేవలం సీట్ల సంఖ్యను డిమాండ్ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, అభ్యర్థుల గెలుపు అవకాశాలు (విన్నబిలిటీ), గత ఎన్నికల పనితీరు, క్షేత్రస్థాయి రాజకీయ వాస్తవాల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరగాలని ఎస్పీ తేల్చిచెప్పింది. అంతేకాకుండా తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాల్లో ఎలాంటి రాజీ పడబోమని, కాంగ్రెస్ కోరుతున్న నియోజకవర్గాల్లో వారి అభ్యర్థుల పేర్లను ముందుగా చెప్పాలని ఎస్పీ పట్టుబట్టింది.కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచుతూ 5 స్థానాలకు అభ్యర్థుల ప్రకటనచర్చలు కొలిక్కి రాకముందే సమాజ్‌వాదీ పార్టీ తన మిత్రపక్షంపై ఒత్తిడి పెంచే వ్యూహానికి తెరలేపింది. 2027 ఎన్నికలకు గానూ ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎస్పీ విడుదల చేసింది. ఇందులో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బెహాట్ నుంచి ఉమర్ అలీ ఖాన్, సహరాన్‌పూర్ నుంచి ఆశు మాలిక్ పేర్లను ప్రకటించింది. ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్ పార్టీతో పాటు సహరాన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఎప్పటినుంచో కన్నేసి ఉంచారు.అఖిలేశ్ యాదవ్ ట్వీట్.. 'పీడీఏ' అభ్యర్థులుగా బరిలోకిమరోవైపు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్‌కు కీలక సందేశం పంపారు. పట్టుదలకు పోయి సీట్ల సంఖ్యపై కాకుండా, పరస్పర సర్దుబాటు, అభ్యర్థుల గెలుపు అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. కూటమి తరఫున బరిలోకి దిగే ఉమ్మడి అభ్యర్థులందరినీ ‘పీడీఏ (PDA) అభ్యర్థులు’గా నిలబెట్టాలని స్పష్టం చేశారు. ఇప్పటికే చర్చించిన 26 సీట్లకు అదనంగా తమకు బలమైన గెలుపు అవకాశాలున్న మరికొన్ని నియోజకవర్గాల జాబితాను పంపాలని కాంగ్రెస్‌ను కోరారు.మరింత చదవండి

Source link