Last Updated:
Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
గురువారం ఉదయం 9:05 గంటలకు మనీకంట్రోల్ వెల్లడించిన లైవ్ మార్కెట్ వివరాల ప్రకారం, దేశీయ కమోడిటీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పతనం అవుతూ వస్తోన్న బంగారం, వెండి ధరల్లో నేడు భారీ జంప్ కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, పెట్టుబడిదారుల కొనుగోలు–అమ్మకాల ధోరణులు వంటి అంశాల ప్రభావంతో కమోడిటీ ధరల్లో ఈ మార్పులు కనిపిస్తున్నాయి.
MCXలో డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,22,758 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,621 పెరిగింది. వెండి విషయానికి వస్తే MCX డిసెంబర్ 4 ఫ్యూచర్ కాంట్రాక్టులో కిలో వెండి ధర రూ.1,47,298 వద్ద ట్రేడవుతోంది. గత ట్రేడింగ్ సెషన్ ముగింపు ధరతో పోలిస్తే కిలో వెండిపై రూ.4,781పెరిగింది.
ఫ్యూచర్స్ మార్కెట్లోనే కాకుండా హైదరాబాద్ స్పాట్ బులియన్ మార్కెట్లోనూ ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన ధరల ప్రకారం.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,23,300కు చేరింది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే రూ.1,420 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,17,300గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ. 1,48, 000 వద్ద కొనసాగుతుంది. క్రితం ముగింపుతో రూ. 4,260 పెరిగింది.

