ఇక చైనా నుంచి దిగుమతులు తగ్గనున్నాయి.. కేంద్ర నిర్ణయం దేశంలో భారీ మార్పు.. |


Last Updated:

భారత్‌ను భారీ యంత్రాల తయారీ కేంద్రంగా మార్చేందుకు రూ.11 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది…..

ప్రధాని మోదీ (File)
ప్రధాని మోదీ (File)

భారత్‌ను నిర్మాణ రంగానికి అవసరమైన భారీ యంత్రాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. క్రేన్లు, బుల్డోజర్లు, టన్నెల్ బోరింగ్ యంత్రాలు సహా ఆధునిక నిర్మాణ పరికరాలను దేశంలోనే తయారు చేసేలా రూ.11 వేల కోట్ల ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.19,934 కోట్ల విలువైన ఐదు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. వీటిలో నిర్మాణ పరికరాల తయారీతో పాటు తమిళనాడులో కొత్త కంటైనర్ టెర్మినల్, అసోంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, తపాలా శాఖకు సంబంధించిన రెండు పథకాలు ఉన్నాయి.

విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడమే లక్ష్యం

దేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అవసరమైన భారీ యంత్రాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. గత ఏడాది భారత్‌లో రూ.97,500 కోట్ల విలువైన నిర్మాణ పరికరాలు తయారైనా.. దేశ అవసరాల్లో 45 శాతం వరకు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సరఫరాలో అంతరాయాలు ఎదురయ్యే అవకాశాలను తగ్గించి, స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఎనిమిదేళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమం ద్వారా భారత్‌ను దిగుమతిదారు స్థాయి నుంచి ప్రపంచస్థాయి తయారీదారుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా టన్నెల్ బోరింగ్ యంత్రాలు, ఆఫ్‌-హైవే ట్రక్కులు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, లోడర్లు, పైలింగ్ రిగ్స్, డ్రిల్లింగ్ యంత్రాలు వంటి ఏడు రకాల భారీ పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్, హైడ్రాలిక్ వ్యవస్థలు, అండర్‌క్యారేజ్, డ్రైవ్ వ్యవస్థలు వంటి ఐదు కీలక భాగాలను కూడా దేశీయంగా తయారు చేయనున్నారు. ఉత్పత్తి, అమ్మకాల ఆధారంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు.

యంత్రాల పరీక్షలకు ప్రత్యేక కేంద్రం

భారత్‌లో తయారైన యంత్రాల నాణ్యతను దేశంలోనే పరీక్షించి ధ్రువీకరించేందుకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)కు రూ.375 కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రూ.21 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.

తమిళనాడులో కొత్త కంటైనర్ టెర్మినల్

కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి రూ.4,288.26 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో డీబీఎఫ్‌ఓటీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు 900 మీటర్ల పొడవుతో రెండు దశల్లో పూర్తవుతుంది. ఏడాదికి 20 లక్షల టీఈయూల సామర్థ్యం ఉంటుంది. ప్రైవేటు సంస్థలే పెట్టుబడులు పెట్టనున్నందున ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదు. పెద్ద నౌకలకు సేవలందించే ఈ టెర్మినల్ వల్ల విదేశీ పోర్టులపై ఆధారపడటం తగ్గడంతో పాటు సుమారు 1,550 మందికి ఉపాధి లభించనుంది.

అసోంలో కొత్త విమానాశ్రయం

అసోంలోని సిల్చార్ సమీపంలో ఉన్న డోలూలో రూ.2,014 కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించనున్నారు. 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయాల్లో 800 మంది ప్రయాణికులకు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నారు. ఏ-320 విమానాల కోసం 2,705 మీటర్ల రన్‌వే, ఆరు విమానాలు నిలిపే పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. బరాక్ లోయకు కీలకంగా నిలిచే ఈ విమానాశ్రయం దక్షిణ అసోంతో పాటు పొరుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చనుంది. వాణిజ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడనుంది.

తపాలా శాఖకు నిధులు

ఇతర నిర్ణయాల్లో భాగంగా తపాలా శాఖ పోస్టల్ కార్యకలాపాల పథకానికి రూ.1,141 కోట్లు, ఆస్తుల నిర్వహణ పథకానికి రూ.1,491 కోట్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 November 2026, 4:46 pm Digital Edition : Prabhanews
ఇక చైనా నుంచి దిగుమతులు తగ్గనున్నాయి.. కేంద్ర నిర్ణయం దేశంలో భారీ మార్పు.. |

Last Updated:November 25, 2026 4:30 PM ISTభారత్‌ను భారీ యంత్రాల తయారీ కేంద్రంగా మార్చేందుకు రూ.11 వేల కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.....ప్రధాని మోదీ (File)భారత్‌ను నిర్మాణ రంగానికి అవసరమైన భారీ యంత్రాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. క్రేన్లు, బుల్డోజర్లు, టన్నెల్ బోరింగ్ యంత్రాలు సహా ఆధునిక నిర్మాణ పరికరాలను దేశంలోనే తయారు చేసేలా రూ.11 వేల కోట్ల ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.19,934 కోట్ల విలువైన ఐదు కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. వీటిలో నిర్మాణ పరికరాల తయారీతో పాటు తమిళనాడులో కొత్త కంటైనర్ టెర్మినల్, అసోంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం, తపాలా శాఖకు సంబంధించిన రెండు పథకాలు ఉన్నాయి.విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించడమే లక్ష్యందేశంలో మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అవసరమైన భారీ యంత్రాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. గత ఏడాది భారత్‌లో రూ.97,500 కోట్ల విలువైన నిర్మాణ పరికరాలు తయారైనా.. దేశ అవసరాల్లో 45 శాతం వరకు చైనా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సరఫరాలో అంతరాయాలు ఎదురయ్యే అవకాశాలను తగ్గించి, స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.ఎనిమిదేళ్ల పాటు అమలయ్యే ఈ కార్యక్రమం ద్వారా భారత్‌ను దిగుమతిదారు స్థాయి నుంచి ప్రపంచస్థాయి తయారీదారుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా టన్నెల్ బోరింగ్ యంత్రాలు, ఆఫ్‌-హైవే ట్రక్కులు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, లోడర్లు, పైలింగ్ రిగ్స్, డ్రిల్లింగ్ యంత్రాలు వంటి ఏడు రకాల భారీ పరికరాల తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇంజిన్లు, ట్రాన్స్‌మిషన్, హైడ్రాలిక్ వ్యవస్థలు, అండర్‌క్యారేజ్, డ్రైవ్ వ్యవస్థలు వంటి ఐదు కీలక భాగాలను కూడా దేశీయంగా తయారు చేయనున్నారు. ఉత్పత్తి, అమ్మకాల ఆధారంగా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు.యంత్రాల పరీక్షలకు ప్రత్యేక కేంద్రంభారత్‌లో తయారైన యంత్రాల నాణ్యతను దేశంలోనే పరీక్షించి ధ్రువీకరించేందుకు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)కు రూ.375 కోట్ల గ్రాంట్ ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా రూ.21 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది.తమిళనాడులో కొత్త కంటైనర్ టెర్మినల్కామరాజర్ పోర్ట్ లిమిటెడ్‌లో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మాణానికి రూ.4,288.26 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో డీబీఎఫ్‌ఓటీ విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు 900 మీటర్ల పొడవుతో రెండు దశల్లో పూర్తవుతుంది. ఏడాదికి 20 లక్షల టీఈయూల సామర్థ్యం ఉంటుంది. ప్రైవేటు సంస్థలే పెట్టుబడులు పెట్టనున్నందున ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదు. పెద్ద నౌకలకు సేవలందించే ఈ టెర్మినల్ వల్ల విదేశీ పోర్టులపై ఆధారపడటం తగ్గడంతో పాటు సుమారు 1,550 మందికి ఉపాధి లభించనుంది.అసోంలో కొత్త విమానాశ్రయంఅసోంలోని సిల్చార్ సమీపంలో ఉన్న డోలూలో రూ.2,014 కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించనున్నారు. 12,351 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ఏర్పాటు చేస్తారు. రద్దీ సమయాల్లో 800 మంది ప్రయాణికులకు సేవలందించేలా దీనిని రూపొందిస్తున్నారు. ఏ-320 విమానాల కోసం 2,705 మీటర్ల రన్‌వే, ఆరు విమానాలు నిలిపే పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు. బరాక్ లోయకు కీలకంగా నిలిచే ఈ విమానాశ్రయం దక్షిణ అసోంతో పాటు పొరుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చనుంది. వాణిజ్యం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పర్యాటక రంగాల అభివృద్ధికి దోహదపడనుంది.తపాలా శాఖకు నిధులుఇతర నిర్ణయాల్లో భాగంగా తపాలా శాఖ పోస్టల్ కార్యకలాపాల పథకానికి రూ.1,141 కోట్లు, ఆస్తుల నిర్వహణ పథకానికి రూ.1,491 కోట్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.మరింత చదవండి

Source link