Snake Tips: వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు పొలాలు, కలుగుల్లో నీరు చేరడంతో పాములు, తేళ్లు, ఇతర విషకీటకాలు బయటకు వస్తాయి. పొడిగా, వెచ్చగా ఉండే ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి, గుమ్మాల ముందుకు రావడం చూస్తుంటాం. ముఖ్యంగా పెరడు, గార్డెన్ ఉన్న ఇళ్లల్లో వర్షాకాలంలో పాముల భయం చాలా ఎక్కువ.

