వర్షాకాలంలో ఇళ్లు, పొలాలు, ఫామ్‌హౌస్‌లు, తోటల వద్ద పాములు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, రాత్రి సమయంలో టార్చ్‌లైట్ ఉపయోగించడం, పాములు కనిపిస్తే వాటికి దూరంగా ఉండి వెంటనే శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడం మంచిది. పాములతో సరదాగా ఆడుకోవడం ధైర్యం కాదు.. అది ప్రాణాలతో చెలగాటం. ఒక చిన్న నిర్లక్ష్యం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది.
