Last Updated:
UPI డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో కీలక మార్పులు రావచ్చా? రూ.2,000 వంటి లావాదేవీ పరిమితి వస్తుందా? ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, చిన్న వ్యాపారులు, MSMEలు, D2C సంస్థలపై అదనపు భారం పడుతుందా? ఆ ఖర్చును వ్యాపారులే భరిస్తారా.. లేక చివరికి వినియోగదారుల జేబుకే చేరుతుందా? అంతేకాదు, కొత్త ఛార్జీలతో మళ్లీ క్యాష్ లేదా COD వైపు మళ్లే పరిస్థితి వస్తుందా? కేంద్రం తుది నిర్ణయం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే.
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన UPIపై Merchant Discount Rate (MDR) విధించే ప్రతిపాదన మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తే కొన్ని UPI లావాదేవీలపై ఈ-కామర్స్, కన్స్యూమర్ ఇంటర్నెట్ సంస్థలు అదనపు చెల్లింపు ఖర్చులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే దీని అసలు ప్రభావం ఎంత ఉంటుందనేది ప్రభుత్వం నిర్ణయించే ఛార్జీ రేటు, లావాదేవీ పరిమితి, ఏ వ్యాపారులను పరిధిలోకి తీసుకురావాలనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

