చిల్లీ గోబీ తయారీలో ప్రధానంగా కాలీఫ్లవర్ అవసరం. దీనికి మైదా, కార్న్‌ఫ్లోర్, శనగపిండి, బియ్యప్పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, నిమ్మరసం, ఉప్పు, నూనె అవసరం. ప్రత్యేకమైన రుచి కోసం దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనీస్, సోంపు, జీలకర్ర, షాజీరాను స్వల్పంగా వేయించి పొడి చేసుకోవాలి. ఈ మసాలా చిల్లీ గోబీకి మంచి సువాసనతో పాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.
