కొత్త నిబంధన గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. “9H”, “ప్రీమియం”, “హై స్ట్రెంగ్త్”, “అన్బ్రేకబుల్” వంటి ప్రచార పదాలతో అమ్మే స్క్రీన్ ప్రొటెక్టర్లకు సంబంధించిన సాంకేతిక అవసరాలను కూడా ఈ ప్రమాణం నిర్దేశిస్తుంది. ఇప్పటివరకు చాలామంది వినియోగదారులు “9H”, “ప్రీమియం”, “హై స్ట్రెంగ్త్”, “అన్బ్రేకబుల్” వంటి మార్కెటింగ్ క్లెయిమ్స్ చూసి స్క్రీన్ ప్రొటెక్టర్లు కొనుగోలు చేస్తున్నారు. కొత్త నిబంధనతో ప్రభుత్వం గుర్తించిన ఈ ఉత్పత్తులకు అధికారిక ఇండియన్ స్టాండర్డ్ వర్తించనుంది. దీంతో ఉత్పత్తుల నాణ్యత, పనితీరులో ఒక స్థిరమైన ప్రమాణం తీసుకురావడమే ఈ వ్యవస్థ ఉద్దేశం. (ప్రతీకాత్మక చిత్రం)

