ప్రభన్యూస్

Skyroot Vikram-1: నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్.. భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

Skyroot Vikram-1: ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది.

నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ (Image - x - SkyrootA)
నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ (Image – x – SkyrootA)

ఈరోజు (జులై 18) శనివారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ టెస్ట్ ఫ్లైట్-1 ‘మిషన్ ఆగమన్’ ప్రయోగం జరగనుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుందని NDTV రిపోర్ట్ చేసింది. ఓవైపు ఇస్రో నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్న వేళ.. ఈ ప్రైవేట్ రాకెట్ లాంచ్ హాట్ టాపిక్ అయ్యింది.

విక్రమ్-1 రాకెట్ ఎత్తు సుమారు 20 మీటర్లు, నాలుగు స్టేజీలతో రూపొందించినది. మొదటి మూడు స్టేజీలూ.. సాలిడ్ ఫ్యూయల్ (కలామ్-1000, కలామ్-250, కలామ్-100) ఆధారితమైనవి. నాల్గవ స్టేజ్‌లో నాలుగు రామన్-1 లిక్విడ్ ఇంజిన్ల (MMH/NTO)ను ఉపయోగించారు. ఇవి ఆర్బిట్ అడ్జస్ట్‌మెంట్‌లకు సహాయపడతాయి. ఇది 450 కిలోమీటర్ల ఎత్తు వరకూ 350 కేజీల బరువును మోసుకెళ్లగలదు. అలాగే.. సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్‌కి దాదాపు 290 కేజీల వరకు పేలోడ్ లను మోసుకెళ్లగలదు. కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్, 3D-ప్రింటెడ్ ఇంజిన్లు, అధునాతన స్టేజ్ సెపరేషన్ సిస్టమ్‌లు దీని ప్రత్యేకతలు. స్కైరూట్ ఇంజనీర్లు ఇంటర్నల్ టెస్టింగ్, స్టేజ్ ఫైరింగ్ టెస్టులు, ఇంటిగ్రేషన్ పూర్తి చేశారని వికీపీడియో రిపోర్ట్ చేసింది.

మిషన్ ఆగమన్ లక్ష్యాలు, పేలోడ్‌లు:

రాకెట్‌ని లాంచ్ చెయ్యగలగడం, పేలోడ్‌లను ఆర్బిట్‌లో ఉంచడం ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. ప్రధాన పేలోడ్‌లు చూస్తే.. స్కైరూట్ SCOPE శాటిలైట్ (టెక్ డెమో), గ్రహా స్పేస్ SOLARAS S3 (సోలార్ రేడియేషన్, ఎర్త్ ఇమేజరీ), కాస్మోసర్వ్ స్పేస్ Embrace రోబోటిక్ ఆర్మ్ (స్పేస్ డెబ్రీస్ రిమూవల్ డెమో), జర్మనీ DCUBED టెక్ డెమోలు ఉన్నాయి. అదనంగా సింబాలిక్ పేలోడ్‌లు కూడా ఉన్నాయి. అవి కాస్మిక్ బ్లూమ్ డైమండ్ జ్యువెలరీ, 18 క్యారెట్ గోల్డ్ మినీ రాకెట్. ఇవి భారత స్పేస్ ఎకోసిస్టమ్ బలాన్ని చూపిస్తాయి.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!

ఈ ప్రయోగం భారత స్పేస్ రంగాన్ని మార్చేస్తుంది. ISRO తర్వాత ప్రైవేట్ సంస్థలు ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం పొందడం మైలురాయి. స్కైరూట్ ఏరోస్పేస్ CEO పవన్ కుమార్ చందనా ప్రకారం ఇది ప్రైవేట్ సెక్టార్‌కి బూస్ట్ ఇస్తుంది. 2027 నాటికి కమర్షియల్ లాంచ్‌లు లక్ష్యం. ఈ రాకెట్ ద్వారా చిన్న శాటిలైట్‌లను తక్కువ ఖర్చుతో లాంచ్ చెయ్యవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ ఈ ప్రయోగానికి హాజరవుతున్నట్లు తెలిసింది. ఇది రాష్ట్ర స్పేస్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సపోర్ట్ ఇస్తుంది. శ్రీహరికోట వ్యూయింగ్ గ్యాలరీ నుంచి ప్రజలు ఈ లాంచ్‌ని చూసేందుకు రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేశారు.

ప్రయోగం ప్రాముఖ్యం:

ఇది భారత్‌ను గ్లోబల్ ప్రైవేట్ స్పేస్ మార్కెట్‌లోకి తీసుకెళ్తుంది. స్కైరూట్ ఇదివరకు 2022లో విక్రమ్-S సబ్-ఆర్బిటల్ సక్సెస్ పొందింది. ఇది ఇంజనీరింగ్, మెటీరియల్స్, , ప్రొపల్షన్ టెక్నాలజీలలో భారత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. వాతావరణం, సేఫ్టీ క్లియరెన్స్‌లపై ఆధారపడి లాంచ్ జరుగుతుంది. స్కైరూట్ ఛానల్స్ ద్వారా లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.

ప్రయోగం విజయవంతం అవ్వడం ద్వారా.. ఇది ISRO-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌ను బలపరుస్తుంది. ఇందులో ఇన్‌స్పేస్, ISRO మద్దతు కీలకమైనది. భారతీయులందరూ ఈ లాంచ్‌ని ఆసక్తిగా గమనిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:09 am Digital Edition : Prabhanews
Skyroot Vikram-1: నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్.. భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 18, 2026 5:54 AM ISTSkyroot Vikram-1: ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది.నేడు నింగిలోకి స్కైరూట్ విక్రమ్-1 రాకెట్ (Image - x - SkyrootA)ఈరోజు (జులై 18) శనివారం ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC-SHAR) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ టెస్ట్ ఫ్లైట్-1 ‘మిషన్ ఆగమన్’ ప్రయోగం జరగనుంది. ఇది భారతదేశంలో ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ లాంచ్ కావడం విశేషం. హైదరాబాద్ ఆధారిత స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ ఈ విజయంతో భారత స్పేస్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుందని NDTV రిపోర్ట్ చేసింది. ఓవైపు ఇస్రో నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్న వేళ.. ఈ ప్రైవేట్ రాకెట్ లాంచ్ హాట్ టాపిక్ అయ్యింది.విక్రమ్-1 రాకెట్ ఎత్తు సుమారు 20 మీటర్లు, నాలుగు స్టేజీలతో రూపొందించినది. మొదటి మూడు స్టేజీలూ.. సాలిడ్ ఫ్యూయల్ (కలామ్-1000, కలామ్-250, కలామ్-100) ఆధారితమైనవి. నాల్గవ స్టేజ్‌లో నాలుగు రామన్-1 లిక్విడ్ ఇంజిన్ల (MMH/NTO)ను ఉపయోగించారు. ఇవి ఆర్బిట్ అడ్జస్ట్‌మెంట్‌లకు సహాయపడతాయి. ఇది 450 కిలోమీటర్ల ఎత్తు వరకూ 350 కేజీల బరువును మోసుకెళ్లగలదు. అలాగే.. సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్‌కి దాదాపు 290 కేజీల వరకు పేలోడ్ లను మోసుకెళ్లగలదు. కార్బన్ కాంపోజిట్ స్ట్రక్చర్, 3D-ప్రింటెడ్ ఇంజిన్లు, అధునాతన స్టేజ్ సెపరేషన్ సిస్టమ్‌లు దీని ప్రత్యేకతలు. స్కైరూట్ ఇంజనీర్లు ఇంటర్నల్ టెస్టింగ్, స్టేజ్ ఫైరింగ్ టెస్టులు, ఇంటిగ్రేషన్ పూర్తి చేశారని వికీపీడియో రిపోర్ట్ చేసింది.మిషన్ ఆగమన్ లక్ష్యాలు, పేలోడ్‌లు:రాకెట్‌ని లాంచ్ చెయ్యగలగడం, పేలోడ్‌లను ఆర్బిట్‌లో ఉంచడం ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. ప్రధాన పేలోడ్‌లు చూస్తే.. స్కైరూట్ SCOPE శాటిలైట్ (టెక్ డెమో), గ్రహా స్పేస్ SOLARAS S3 (సోలార్ రేడియేషన్, ఎర్త్ ఇమేజరీ), కాస్మోసర్వ్ స్పేస్ Embrace రోబోటిక్ ఆర్మ్ (స్పేస్ డెబ్రీస్ రిమూవల్ డెమో), జర్మనీ DCUBED టెక్ డెమోలు ఉన్నాయి. అదనంగా సింబాలిక్ పేలోడ్‌లు కూడా ఉన్నాయి. అవి కాస్మిక్ బ్లూమ్ డైమండ్ జ్యువెలరీ, 18 క్యారెట్ గోల్డ్ మినీ రాకెట్. ఇవి భారత స్పేస్ ఎకోసిస్టమ్ బలాన్ని చూపిస్తాయి.ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!ఈ ప్రయోగం భారత స్పేస్ రంగాన్ని మార్చేస్తుంది. ISRO తర్వాత ప్రైవేట్ సంస్థలు ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం పొందడం మైలురాయి. స్కైరూట్ ఏరోస్పేస్ CEO పవన్ కుమార్ చందనా ప్రకారం ఇది ప్రైవేట్ సెక్టార్‌కి బూస్ట్ ఇస్తుంది. 2027 నాటికి కమర్షియల్ లాంచ్‌లు లక్ష్యం. ఈ రాకెట్ ద్వారా చిన్న శాటిలైట్‌లను తక్కువ ఖర్చుతో లాంచ్ చెయ్యవచ్చు.
Vikram-1 has been modeled, simulated, tested, and qualified. And some questions can only be answered in flight. This episiode follows the team to Sriharikota, where the launch campaign is close to completion and with each passing day, Vikram-1 moves one step closer to flight.… pic.twitter.com/E2TZNgUXCU
— Skyroot Aerospace (@SkyrootA) July 11, 2026ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ ఈ ప్రయోగానికి హాజరవుతున్నట్లు తెలిసింది. ఇది రాష్ట్ర స్పేస్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి సపోర్ట్ ఇస్తుంది. శ్రీహరికోట వ్యూయింగ్ గ్యాలరీ నుంచి ప్రజలు ఈ లాంచ్‌ని చూసేందుకు రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేశారు.ప్రయోగం ప్రాముఖ్యం:ఇది భారత్‌ను గ్లోబల్ ప్రైవేట్ స్పేస్ మార్కెట్‌లోకి తీసుకెళ్తుంది. స్కైరూట్ ఇదివరకు 2022లో విక్రమ్-S సబ్-ఆర్బిటల్ సక్సెస్ పొందింది. ఇది ఇంజనీరింగ్, మెటీరియల్స్, , ప్రొపల్షన్ టెక్నాలజీలలో భారత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. వాతావరణం, సేఫ్టీ క్లియరెన్స్‌లపై ఆధారపడి లాంచ్ జరుగుతుంది. స్కైరూట్ ఛానల్స్ ద్వారా లైవ్ స్ట్రీమ్ అందుబాటులో ఉంటుంది.ప్రయోగం విజయవంతం అవ్వడం ద్వారా.. ఇది ISRO-ప్రైవేట్ పార్టనర్‌షిప్ మోడల్‌ను బలపరుస్తుంది. ఇందులో ఇన్‌స్పేస్, ISRO మద్దతు కీలకమైనది. భారతీయులందరూ ఈ లాంచ్‌ని ఆసక్తిగా గమనిస్తున్నారు.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link