ప్రభన్యూస్

Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? |


Last Updated:

Trump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు.

డొనాల్డ్ ట్రంప్‌ (Image credit - reuters)
డొనాల్డ్ ట్రంప్‌ (Image credit – reuters)

ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ సర్వీస్ పొందిన వారికి ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లోని టాప్ అకౌంట్లను వెంటనే యాక్సెస్ చెయ్యవచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ పోస్టులకు రియల్-టైమ్ లేదా మిల్లీసెకండ్లలో యాక్సెస్ పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్.. ఆగస్టు 1 నుంచి సంస్థాగత కస్టమర్లు.. అంటే వాల్ స్ట్రీట్ సంస్థలు, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడే విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల ఆయా సంస్థలూ, ట్రేడర్లూ.. ట్రంప్ చేసే పోస్టుల ఆధారంగా.. ట్రేడింగ్ చేసే ప్రమాదం పొంచి ఉందనీ.. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు దారి తీస్తుందనే విమర్శలు వస్తున్నాయని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.

దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూడవచ్చు. ట్రంప్.. ఇరాన్ యుద్ధాన్ని పూర్తిగా ముగిస్తున్నా అని ఒక పోస్ట్ చేస్తే.. అది ముందుగా.. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పొందిన వారికి తెలుస్తుంది. వెంటనే వారు.. చమురు సంస్థల షేర్లను అమ్మేస్తారు. ఎందుకంటే.. యుద్ధం ముగిస్తే.. చమురు ధర పడిపోతుంది. తద్వారా ట్రేడర్లు ముందుగానే షేర్లు అమ్ముకొని బయటపడతారు. కానీ సబ్‌స్క్రిప్షన్ లేని వారు.. ఆ పనిని ముందే చెయ్యలేరు. దాంతో వారు నష్టపోతారు. అంటే.. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటిదే అనే విమర్శలు వస్తున్నాయి. షేర్లు మాత్రమే కాదు.. కరెన్సీలు, బాండ్లు. క్రిప్టోల వంటివి కూడా ముందే ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ సామాన్య ప్రజలను నష్టపోయేలా చెయ్యగలవు.

ఇవి కూడా చదవండి: Date Seed Coffee: ఖర్జూరం గింజల కాఫీ.. నో కెఫీన్.. రుచికరం, ఆరోగ్యం.. ఇలా ప్రిపేర్ చేసుకోండి

ట్రూత్ API సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పొందిన వారికి ట్రూత్ సోషల్‌లోని టాప్ 10 అకౌంట్ల పోస్టులు లైసెన్స్‌డ్ డేటా ఫీడ్‌గా లభిస్తాయి. వాటిలో ట్రంప్ అకౌంట్ కూడా ఉంది. ఈ సర్వీస్‌సో 2022 నుంచి ఆర్కైవ్ డేటా కూడా ఉంటుంది. ఇంటరిమ్ CEO కెవిన్ మెక్‌గర్న్ ప్రకారం, ట్రంప్ తరచూ టారిఫ్స్, ట్రేడ్ పాలసీలపై చేస్తున్న పోస్టులు.. గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఇదివరకు ట్రంప్ పోస్టులు పెట్టే ముందు అమెరికా స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్ల విలువలు బాగా పెరిగేవి. ట్రంప్ పోస్ట్ పెట్టాక.. ఒక్కసారిగా ఆ షేర్ల విలువలు పతనం అయ్యేవి. ఇదంతా కుట్ర పూరితంగానే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యల ద్వారా ట్రంప్ ఫ్యామిలీ, వాల్ స్ట్రీట్‌కి లాభం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.

ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!

ట్రంప్‌ని మనం గమనిస్తే.. ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకోరు. నిరంతరం నిర్ణయాల్ని మార్చేస్తూ ఉంటారు. ఇవాళ యుద్ధం క్లోజ్ అంటారు. రేపు మళ్లీ దాడులు చేస్తారు. మరో రోజు.. ఇంకో దేశంపై యుద్ధానికి తెరతీస్తారు. ఇలా ట్రంప్ ఎందుకు వెంట వెంటనే నిర్ణయాల్ని మార్చేస్తున్నారు అనే సందేహాలు కలుగుతున్నాయి. దీని వెనక ట్రేడింగ్ అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాలతో లాభ పడేవారు.. లాబీయింగ్ చేస్తూ.. ట్రంప్ ఫ్యామిలీకి మేలు జరిగేలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ట్రంప్ కంటే ముందు ఉన్న జోబిడెన్ ఏనాడూ ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే.. నిర్ణయాల్లో విరుద్ధమైన మార్పులు కూడా వెంటవెంటనే ఉండేవి కావు. కానీ ట్రంప్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు అయివుండి.. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయి. దీని వెనక పెద్ద ట్రేడింగ్ కుట్ర ఉందనే విశ్లేషణలున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 11:10 am Digital Edition : Prabhanews
Trump Media Truth API: డొనాల్డ్ ట్రంప్‌పై ఆరోపణలు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడుతున్నారా? ఏం జరుగుతోంది? |

Last Updated:Jul 18, 2026 10:56 AM ISTTrump Media Truth API: ట్రంప్ ఏం చేసినా ఏదో ఒక కలకలం తప్పదు. ఇప్పుడు మరో పెద్ద దుమారం రేగుతోంది. అది ఏకంగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు దారితీసింది. అది నిజమైతే పెను కల్లోలం తప్పదు. డొనాల్డ్ ట్రంప్‌ (Image credit - reuters)ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) జూలై 16న ట్రూత్ API అనే కొత్త సర్వీసును ప్రకటించింది. ఈ సర్వీస్ పొందిన వారికి ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లోని టాప్ అకౌంట్లను వెంటనే యాక్సెస్ చెయ్యవచ్చు. అలాగే డొనాల్డ్ ట్రంప్ పోస్టులకు రియల్-టైమ్ లేదా మిల్లీసెకండ్లలో యాక్సెస్ పొందవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్.. ఆగస్టు 1 నుంచి సంస్థాగత కస్టమర్లు.. అంటే వాల్ స్ట్రీట్ సంస్థలు, హై-ఫ్రీక్వెన్సీ ట్రేడర్లకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడే విమర్శలు వస్తున్నాయి. దీని వల్ల ఆయా సంస్థలూ, ట్రేడర్లూ.. ట్రంప్ చేసే పోస్టుల ఆధారంగా.. ట్రేడింగ్ చేసే ప్రమాదం పొంచి ఉందనీ.. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ అక్రమాలకు దారి తీస్తుందనే విమర్శలు వస్తున్నాయని సీబీఎస్ న్యూస్ రిపోర్ట్ చేసింది.దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్‌తో చూడవచ్చు. ట్రంప్.. ఇరాన్ యుద్ధాన్ని పూర్తిగా ముగిస్తున్నా అని ఒక పోస్ట్ చేస్తే.. అది ముందుగా.. ఈ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పొందిన వారికి తెలుస్తుంది. వెంటనే వారు.. చమురు సంస్థల షేర్లను అమ్మేస్తారు. ఎందుకంటే.. యుద్ధం ముగిస్తే.. చమురు ధర పడిపోతుంది. తద్వారా ట్రేడర్లు ముందుగానే షేర్లు అమ్ముకొని బయటపడతారు. కానీ సబ్‌స్క్రిప్షన్ లేని వారు.. ఆ పనిని ముందే చెయ్యలేరు. దాంతో వారు నష్టపోతారు. అంటే.. ఇది ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటిదే అనే విమర్శలు వస్తున్నాయి. షేర్లు మాత్రమే కాదు.. కరెన్సీలు, బాండ్లు. క్రిప్టోల వంటివి కూడా ముందే ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ సామాన్య ప్రజలను నష్టపోయేలా చెయ్యగలవు.ఇవి కూడా చదవండి: Date Seed Coffee: ఖర్జూరం గింజల కాఫీ.. నో కెఫీన్.. రుచికరం, ఆరోగ్యం.. ఇలా ప్రిపేర్ చేసుకోండిట్రూత్ API సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ పొందిన వారికి ట్రూత్ సోషల్‌లోని టాప్ 10 అకౌంట్ల పోస్టులు లైసెన్స్‌డ్ డేటా ఫీడ్‌గా లభిస్తాయి. వాటిలో ట్రంప్ అకౌంట్ కూడా ఉంది. ఈ సర్వీస్‌సో 2022 నుంచి ఆర్కైవ్ డేటా కూడా ఉంటుంది. ఇంటరిమ్ CEO కెవిన్ మెక్‌గర్న్ ప్రకారం, ట్రంప్ తరచూ టారిఫ్స్, ట్రేడ్ పాలసీలపై చేస్తున్న పోస్టులు.. గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.ఇదివరకు ట్రంప్ పోస్టులు పెట్టే ముందు అమెరికా స్టాక్ మార్కెట్‌లో కొన్ని షేర్ల విలువలు బాగా పెరిగేవి. ట్రంప్ పోస్ట్ పెట్టాక.. ఒక్కసారిగా ఆ షేర్ల విలువలు పతనం అయ్యేవి. ఇదంతా కుట్ర పూరితంగానే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చర్యల ద్వారా ట్రంప్ ఫ్యామిలీ, వాల్ స్ట్రీట్‌కి లాభం జరుగుతోందనే ఆరోపణలున్నాయి.ఇవి కూడా చదవండి: AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతం అల్లకల్లోలం.. ఏపీ, తెలంగాణకు 6 రోజులు వర్ష సూచన.!ట్రంప్‌ని మనం గమనిస్తే.. ఆయన స్థిరమైన నిర్ణయాలు తీసుకోరు. నిరంతరం నిర్ణయాల్ని మార్చేస్తూ ఉంటారు. ఇవాళ యుద్ధం క్లోజ్ అంటారు. రేపు మళ్లీ దాడులు చేస్తారు. మరో రోజు.. ఇంకో దేశంపై యుద్ధానికి తెరతీస్తారు. ఇలా ట్రంప్ ఎందుకు వెంట వెంటనే నిర్ణయాల్ని మార్చేస్తున్నారు అనే సందేహాలు కలుగుతున్నాయి. దీని వెనక ట్రేడింగ్ అక్రమాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ నిర్ణయాలతో లాభ పడేవారు.. లాబీయింగ్ చేస్తూ.. ట్రంప్ ఫ్యామిలీకి మేలు జరిగేలా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.ట్రంప్ కంటే ముందు ఉన్న జోబిడెన్ ఏనాడూ ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే.. నిర్ణయాల్లో విరుద్ధమైన మార్పులు కూడా వెంటవెంటనే ఉండేవి కావు. కానీ ట్రంప్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా అధ్యక్షుడు అయివుండి.. ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలొస్తున్నాయి. దీని వెనక పెద్ద ట్రేడింగ్ కుట్ర ఉందనే విశ్లేషణలున్నాయి.Click here to add News18 as your preferred news source on Google. బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,TelanganaFirst Published :Jul 18, 2026 10:55 AM ISTమరింత చదవండి

Source link