Last Updated:
నిన్న రిలీజైన ‘సీన్’ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్.
రెండు రోజుల ముందు రిలీజైన ‘సీన్’ సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ మాత్రం జనాలకు ఓ రేంజ్‌లో పిచ్చెక్కించింది. అసలు ఫస్ట్ హాఫ్ కొన్నిచోట్ల బోరింగ్ ఫీల్ అనిపించింది కానీ.. సెకండ్ హాఫ్‌ను ఓ రేంజ్‌లో చూపించాడు దర్శకుడు జీతు మాధవన్. అసలు సూర్య యాక్టింగ్ అయితే పీక్స్. ఏమన్న యాక్టింగ్ చేసిండా… సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చూపించాడు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా గతేడాది వరకు సూర్య చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు. ఒకదానికి మించి మరొకటి అల్ట్రా డిజాస్టర్‌లు పడ్డాయి. మరీ ముఖ్యంగా కంగువా సినిమా సూర్య కెరీర్‌కు బాగా దెబ్బ కొట్టింది. ఎంతలా అంటే అక్షరాల రూ.200 కోట్లు బూడిదలో వేసిన పన్నీరైంది. డబ్బులతో పాటు సూర్యకు కూడా తన కెరీర్‌లో మర్చిపోలేని గాయంలా మారిపోయింది. అయితే.. లాస్ట్ ఇయర్ వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేసిన సూర్య.. ఈ ఏడాది మాత్రం మాములు కంబ్యాక్ ఇవ్వలేదు.
బ్లాక్ లాగ్స్ అన్ని ఒకేసారి క్లియర్ చేసి సర్టిఫికేట్స్ తీసుకున్నట్లు… గతేడాది వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఫేస్ చేసిన సూర్య.. ఈ ఏడాది మాత్రం ఏకంగా 3 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు. కరుప్పు సినిమాతో స్టార్ట్ అయిన బ్లాక్ బస్టర్ జర్నీ.. ఆ తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్, ఇప్పుడు సీన్ సినిమాతో కంటిన్యూ చేస్తున్నాడు. అసలు సీన్ సినిమాకు వస్తున్న టాక్ అంతా ఇంతా కాదు. ఒక్క తమిళనాటే కాదు.. తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
దాంతో కలెక్షన్లు కూడా దుమ్మురేపే రేంజ్‌లో వచ్చాయి. ఈ సినిమా ఫస్ట్ రోజే అక్షరాల రూ.36 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. కంగువా తర్వాత సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా సీన్ మూవీ నిలిచింది. ఇక రెండు రోజుల్లో రూ.40 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు మరీ బీభత్సమైన హైప్ కూడా ఏం లేదు. సరిగ్గా రిలీజ్‌కు ఒక రెండు, మూడు రోజుల ముందు నుంచి తెగ మాట్లాడుకున్నారు. దానికి తోడు టాక్ కూడా పాజిటీవ్‌గా రావడంతో సాలిడ్ కలెక్షన్లు సాధించింది.
ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రూ.5 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయి. తెలుగులో ఈ సినిమాకు రూ.14 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. కాగా.. రూ.15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే మరో రూ.10 కోట్ల వరకు షేర్ రాబట్టాల్సి ఉంది. వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే.. ఈ సినిమాకు రూ.84 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. రూ.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లతో పోల్చుకుంటే.. రూ.45 కోట్ల వరకు సాధించాల్సి ఉంది.

