పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్లో అర్హత ఉన్న కొన్ని ఎస్బీఐ డెబిట్ కార్డులకు ఉంటుంది. డెబిట్ కార్డుతో పాయింట్ ఆఫ్ సేల్ లేదా వ్యాపారి దుకాణంలో కొన్న అర్హత ఉన్న వస్తువులు చోరీ కావడం, ఇంట్లో దొంగతనం జరగడం, ఇంటిని బద్దలుకొట్టి దొంగతనం చేయడం లేదా వాహనం నుంచి వస్తువు చోరీ కావడం వంటి కొన్ని నష్టాల నుంచి ఈ ఇన్సూరెన్స్ రక్షణ ఇస్తుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి 90 రోజుల్లోపు నష్టం జరిగి ఉండాలి. అయితే పాడైపోయే వస్తువులు, నగలు, విలువైన రాళ్లు వంటి కొన్ని వస్తువులకు ఈ కవర్ వర్తించదు. పర్చేజ్ ప్రొటెక్షన్ మొత్తం కూడా డెబిట్ కార్డు రకాన్ని బట్టి మారుతుంది. ఎస్బీఐ గోల్డ్, ఎస్బీఐ ప్రైడ్ – బిజినెస్ డెబిట్ కార్డులకు రూ.5,000 కవర్ ఉంటుంది. ఎస్బీఐ ప్లాటినం, ఎస్బీఐ ప్రీమియం – బిజినెస్ డెబిట్ కార్డులకు రూ.50,000 కవర్ ఉంటుంది. ఎస్బీఐ వీసా సిగ్నేచర్ లేదా మాస్టర్‌కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డులకు రూ.1,00,000 వరకు పర్చేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ వస్తువులను అర్హత ఉన్న డెబిట్ కార్డుతో పాయింట్ ఆఫ్ సేల్ లేదా వ్యాపారి సంస్థలోనే కొనాలి. క్లెయిమ్‌పై వర్తించే ఇన్సూరెన్స్ నిబంధనలు, షరతులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
