Last Updated:
50-30-20 రూల్ భారతీయ కుటుంబాలకు సరిపోతుందా? ఇది ఒక మార్గదర్శకం మాత్రమే, కచ్చితమైన రూల్ లాగా పాటించాలా? మీ ఆదాయం, ఖర్చులు, లక్ష్యాలను బట్టి ఈ ఫార్ములాను ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.
మన నెల జీతంలో 50 శాతం అవసరాల కోసం, 30 శాతం కోరికల కోసం, 20 శాతం పొదుపు కోసం కేటాయించాలి. వినడానికి ఇది చాలా సింపుల్‌గా ఉంది. కానీ భారతీయ కుటుంబాల ఆర్థిక పరిస్థితులకు ఈ 50-30-20 రూల్ నిజంగా సరిపోతుందా? ఒక మార్గదర్శకంగా చూస్తే అవుననే చెప్పొచ్చు. కానీ కచ్చితంగా పాటించాల్సిన రూల్‌గా చూస్తే కాదు. భారతీయ కుటుంబాలకు 50-30-20 నిష్పత్తి సరిగ్గా సరిపోతుందా అనేదానికంటే ముఖ్యమైన విషయం వేరే ఉంది. మన ఆదాయానికి తగ్గట్టే ఖర్చు చేస్తున్నామా? క్రమం తప్పకుండా పొదుపు చేస్తున్నామా? భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల కోసం సరిపడా డబ్బు పక్కన పెడుతున్నామా? అనేదే అసలు విషయం అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్, అఖిల్ కంచర్ల & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు అఖిల్ కంచర్ల. న్యూస్18 తెలుగుతో ఆయన మాట్లాడుతూ ఈ రూల్‌ని ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా అన్వయించుకోవాలో వివరించారు.

