ఈ వివరాలను వాచ్‌లోని ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ద్వారా లేదా ఫిట్‌ప్రో యాప్‌లో చూడొచ్చు. వర్కౌట్ మోడ్‌లు, రోజువారీ వ్యాయామ వివరాలను గుర్తుంచుకునే ఫీచర్, ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే గుర్తుచేసే సెడెంటరీ రిమైండర్ కూడా ఉన్నాయి. ఇవే కాకుండా హార్ట్ రేట్ సెన్సార్, నిద్రను ట్రాక్ చేసే ఫీచర్, క్యాలరీ కౌంటర్, రక్తంలో ఆక్సిజన్ స్థాయిని కొలిచే ఎస్‌పీఓ2 ఫీచర్ కూడా ఉన్నట్లు ప్రొడక్ట్ వివరాల్లో పేర్కొన్నారు. రక్తపోటును పర్యవేక్షించే ఫీచర్ కూడా ఉన్నట్లు స్పెసిఫికేషన్లలో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌కు వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్ మెసేజ్‌ల నోటిఫికేషన్లు వాచ్‌పై కనిపిస్తాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, ట్విట్టర్ వంటి సపోర్ట్ చేసే సోషల్ మీడియా యాప్‌ల నోటిఫికేషన్లను కూడా పొందవచ్చు. వాచ్‌లో ఉన్న ఇంటర్‌ఫేస్ ద్వారా కాల్‌ను స్వీకరించడం లేదా తిరస్కరించడం వంటి ఆప్షన్లు కూడా ఉన్నాయి. (image: Amazon India)

