ప్రభన్యూస్

Sai Pallavi: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి కొత్త పాట.. సర్‌ప్రైజ్ అయితే అదిరింది | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా ఫీల్ గుడ్ మూవీ ‘ఇంజి వెల్లం’. (తెలుగులో ‘అల్లం బెల్లం’) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచీ.. ఆచీ’ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఈ వీడియోలోస్ సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది.

News18
News18

లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా ఫీల్ గుడ్ మూవీ ‘ఇంజి వెల్లం’. (తెలుగులో ‘అల్లం బెల్లం’) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచీ.. ఆచీ’ పాట ఎట్టకేలకు విడుదలైంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సరికొత్త లుక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

గతంలో ‘ఓం’ (OM) చిత్రంలో విభిన్నంగా కనిపించి మెప్పించిన సాయి పల్లవి, ఇప్పుడు ఈ పాటలో మరోసారి పొట్టి జుట్టుతో, నిండు గర్భిణి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గర్భిణి గెటప్‌లో ఎంతో ముద్దుగా కనిపిస్తూనే, తనదైన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సినిమాలో ఆమె పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఇందులో క్యాన్సర్ రోగి పాత్ర పోషిస్తోందని ఊహిస్తుండగా, మరికొందరు తన భర్త (విజయ్ సేతుపతి) నుంచి విడిపోవడం వెనుక ఉన్న భావోద్వేగ కథ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, సాయి పల్లవి పాత్రకు సంబంధించి చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.

మరోవైపు, ఇటీవల ‘రామాయణం’ చిత్ర సంగీతం విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొన్న ఏ.ఆర్. రెహమాన్, ‘ఆచీ.. ఆచీ’ పాటతో తిరిగి తన వింటేజ్ ఫామ్‌లోకి వచ్చేశారు. మణిరత్నం–రెహమాన్ కాంబినేషన్ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయిందని, ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రశంసలు కురుస్తున్నాయి.

కాగా, సాయి పల్లవి ఒకే నెలలో ‘రామాయణం’ (సీత), ‘ఓం’ (నిత్యా రెడ్డి), ‘ఇంజి వెల్లం’ చిత్రాల ద్వారా మూడు పూర్తిగా భిన్నమైన లుక్కుల్లో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే ‘రామాయణం’, ‘ఓం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఇప్పుడు ‘అల్లం బెల్లం’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి పాత్రలోనైనా సులభంగా ఒదిగిపోయే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తుండటం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 1:12 pm Digital Edition : Prabhanews
Sai Pallavi: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సాయి పల్లవి కొత్త పాట.. సర్‌ప్రైజ్ అయితే అదిరింది | తెలుగు సినిమా వార్తలు

Last Updated:November 26, 2026 1:11 PM ISTమణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా ఫీల్ గుడ్ మూవీ ‘ఇంజి వెల్లం’. (తెలుగులో ‘అల్లం బెల్లం’) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచీ.. ఆచీ’ పాట ఎట్టకేలకు విడుదలైంది. ఈ వీడియోలోస్ సాయి పల్లవి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. News18లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా ఫీల్ గుడ్ మూవీ ‘ఇంజి వెల్లం’. (తెలుగులో ‘అల్లం బెల్లం’) నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆచీ.. ఆచీ’ పాట ఎట్టకేలకు విడుదలైంది. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట సోషల్ మీడియాలో భారీ సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ పాటకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన సంగీతం ఒక ఎత్తయితే, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సరికొత్త లుక్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.గతంలో ‘ఓం’ (OM) చిత్రంలో విభిన్నంగా కనిపించి మెప్పించిన సాయి పల్లవి, ఇప్పుడు ఈ పాటలో మరోసారి పొట్టి జుట్టుతో, నిండు గర్భిణి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గర్భిణి గెటప్‌లో ఎంతో ముద్దుగా కనిపిస్తూనే, తనదైన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి సినిమాలో ఆమె పాత్రపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఆమె ఇందులో క్యాన్సర్ రోగి పాత్ర పోషిస్తోందని ఊహిస్తుండగా, మరికొందరు తన భర్త (విజయ్ సేతుపతి) నుంచి విడిపోవడం వెనుక ఉన్న భావోద్వేగ కథ కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, సాయి పల్లవి పాత్రకు సంబంధించి చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.మరోవైపు, ఇటీవల ‘రామాయణం’ చిత్ర సంగీతం విషయంలో కొంత విమర్శలు ఎదుర్కొన్న ఏ.ఆర్. రెహమాన్, ‘ఆచీ.. ఆచీ’ పాటతో తిరిగి తన వింటేజ్ ఫామ్‌లోకి వచ్చేశారు. మణిరత్నం–రెహమాన్ కాంబినేషన్ మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయిందని, ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోందని ప్రశంసలు కురుస్తున్నాయి.కాగా, సాయి పల్లవి ఒకే నెలలో ‘రామాయణం’ (సీత), ‘ఓం’ (నిత్యా రెడ్డి), ‘ఇంజి వెల్లం’ చిత్రాల ద్వారా మూడు పూర్తిగా భిన్నమైన లుక్కుల్లో కనిపించి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటికే ‘రామాయణం’, ‘ఓం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుండగా, ఇప్పుడు ‘అల్లం బెల్లం’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎలాంటి పాత్రలోనైనా సులభంగా ఒదిగిపోయే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో హీరోగా నటిస్తుండటం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చింది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది.మరింత చదవండి

Source link