ముఖ్యంగా కస్టమర్లకు నేరుగా సేవలు అందించే విభాగాల్లో సిబ్బంది కొరత తగ్గనుంది. బ్యాంకు బ్రాంచ్‌ల్లో రోజువారీ కార్యకలాపాలు మరింత సమర్థంగా సాగేందుకు ఈ నియామకాలు ఉపయోగపడతాయి. కస్టమర్లకు సులభంగా, వేగంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ సేవలు అందించేందుకు కూడా ఇవి దోహదపడతాయి. ఈ నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో భాగంగా 2026 సెప్టెంబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్ 29న మెయిన్స్ పరీక్ష జరిపారు. ఈ రెండు పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. 2027 ఆర్థిక సంవత్సరంలో మరో 11,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని ఎస్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు చేపట్టనుంది. (ప్రతీకాత్మక చిత్రం)

