బాహుబలి సినిమాకు ముందు ప్రభాస్ కెరీర్‌లో అత్యంత హైప్ తెచ్చుకున్న సినిమా ఇది. అప్పటికే మాస్, స్టైల్, ముని, డాన్, కాంచనా ఇలా కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా లేని రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం.. అలాగే రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ ఫాదర్‌గా నటించడం వంటివి మాములు హైప్ తీసుకురాలేదు. కట్ చేస్తే, మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరీర్‌లో అత్యంత చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
