రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతకు ప్రతీకగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, అతని సంతోషం, ఆరోగ్యం, ఆయురారోగ్యం కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా తన సోదరికి అండగా ఉంటానని మాట ఇస్తూ బహుమతి ఇస్తాడు. రాఖీ కట్టే సమయంలో కొన్ని కుటుంబాల్లో తమకు ఉన్న సంప్రదాయాలను పాటిస్తారు. అయితే సాధారణంగా పూజా పళ్లెం సిద్ధం చేసి, బొట్టు, అక్షతలు, రాఖీ, హారతి, మిఠాయిలతో పూజను పూర్తి చేస్తారని జ్యోతిష్యులు ప్రశాంత్ శర్మ తెలిపారు.

