Last Updated:
Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: హైదరాబాద్‌లో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ జరగనున్నాయి. అహింస, జీవకరుణ, ధ్యానం, శాకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ మహాసభల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Jathiya Ahimsa Dhyana Maha Sabhalu: అహింస, జీవకరుణ, శాకాహారం, ధ్యానం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ నిర్వహించనున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.

