Last Updated:
రఘు మాస్టర్‌పై రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌పై జానీ మాస్టర్ భార్య సుమలత కంప్లైంట్. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అనూహ్యంగా ఒక ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. వివాదాల్లో చిక్కుకున్న జానీ మాస్టర్ భార్య సుమలత ఈ సంచలన ఫిర్యాదు చేశారు. డాన్సర్స్ అసోసియేషన్ (సొసైటీ) అధికారిక బ్యాంక్ ఖాతాను రఘు మాస్టర్ హ్యాక్ చేశారని ఆమె తన కంప్లైంట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుమలత ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అసలు వాస్తవాలు తెలుసుకునేందుకు రఘు మాస్టర్‌ను నేరుగా స్టేషన్‌కు పిలిపించి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

