సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దక్షిణ మధ్య రైల్వే మంచి ఫలితాలు సాధించింది. 2024-25, 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో (2026 అక్టోబర్ 31 వరకు) మొత్తం 7.32 మిలియన్ యూనిట్ల (MU) సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి వల్ల సుమారు 4,963 టన్నుల కార్బన్ డయాక్సైడ్ (CO₂) ఉద్గారాలు తగ్గినట్లు అంచనా. రైల్వే బోర్డు దక్షిణ మధ్య రైల్వేకు 4.8 మెగావాట్ల సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టింది. అయితే, ఆ లక్ష్యాన్ని దాటి ఇప్పటికే 6.9 మెగావాట్ల సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక్కడితో ఆగకుండా మరో 2.5 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో సౌర విద్యుత్ వినియోగం మరింత పెరగనుంది. (image: South Central Railway)

