ప్రభన్యూస్

Rahul Vijay: రాహుల్ విజయ్ ‘AH’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘AH’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, అడివి శేష్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై బజ్‌ను పెంచాయి.

News18
News18

రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘AH’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, అడివి శేష్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై బజ్‌ను పెంచాయి. ముఖ్యంగా ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ వీడియో సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు.

మొదట ఈ సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత మెరుగ్గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చింది. నవంబర్ 12న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా కథలోని మిస్టరీ, ఉత్కంఠను ప్రతిబింబించేలా ఈ వీడియోను రూపొందించారు.

స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి బాలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టీరియస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

సినిమా గురించి దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. చిత్రబృందం సహకారంతో మంచి అవుట్‌పుట్ అందించగలిగామని నమ్ముతున్నట్లు తెలిపారు. టైటిల్ చుట్టూ ఉన్న అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుషం వంటి అంశాల చుట్టూనే కథ సాగుతుందని వివరించారు. రాహుల్ విజయ్ పోలీస్ అధికారిగా కనిపించే ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నవంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. రాహుల్ విజయ్ కెరీర్‌లో ‘AH’ ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని పేర్కొన్నారు.

ఈ చిత్రంలో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్‌తో పాటు జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. డీఐ పనులను సారథి స్టూడియోస్ నిర్వహిస్తోంది. వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేపట్టింది.

మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘AH’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీతో పాటు తాజాగా వచ్చిన కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 5:12 pm Digital Edition : Prabhanews
Rahul Vijay: రాహుల్ విజయ్ ‘AH’ రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలోకి ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 26, 2026 5:08 PM ISTరాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘AH’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, అడివి శేష్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై బజ్‌ను పెంచాయి.News18రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ ‘AH’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించగా, అడివి శేష్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై బజ్‌ను పెంచాయి. ముఖ్యంగా ‘బ్లడీ హంగర్’ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల విడుదలైన ‘ఇదేనా ఇదేనా’ లిరికల్ వీడియో సాంగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు.మొదట ఈ సినిమాను అక్టోబర్ 30న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం భావించింది. అయితే, సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను మరింత మెరుగ్గా పూర్తి చేయాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చింది. నవంబర్ 12న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమా కథలోని మిస్టరీ, ఉత్కంఠను ప్రతిబింబించేలా ఈ వీడియోను రూపొందించారు.స్టార్ బాక్స్ స్టోరీస్, రిపుల్ స్లైడ్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కనకరావు తొనంగి, అభిషేక్ కె, ప్రముఖ ఎడిటర్ గ్యారీ BH నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సాయి బాలి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్టీరియస్ ఇన్వెస్టిగేషన్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రాహుల్ విజయ్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.సినిమా గురించి దర్శకుడు సాయి బాలి మాట్లాడుతూ.. చిత్రబృందం సహకారంతో మంచి అవుట్‌పుట్ అందించగలిగామని నమ్ముతున్నట్లు తెలిపారు. టైటిల్ చుట్టూ ఉన్న అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ, అనుమానం, అసాంఘికం, అమానుషం వంటి అంశాల చుట్టూనే కథ సాగుతుందని వివరించారు. రాహుల్ విజయ్ పోలీస్ అధికారిగా కనిపించే ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నవంబర్ 12న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.నిర్మాతలు మాట్లాడుతూ.. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. రాహుల్ విజయ్ కెరీర్‌లో ‘AH’ ఓ మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసక్తికరమైన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తుందని పేర్కొన్నారు.ఈ చిత్రంలో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్‌తో పాటు జాన్ విజయ్, సుదర్శన్, మిర్చి కిరణ్, బిత్తిరి సత్తి, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అభినవ్ వి. కునపరెడ్డి, గ్యారీ BH ఎడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. డీఐ పనులను సారథి స్టూడియోస్ నిర్వహిస్తోంది. వీఎఫ్‌ఎక్స్ బాధ్యతలను జాయింట్ ఫ్యామిలీ ఫిల్మ్స్ చేపట్టింది.మిస్టరీ, ఎమోషన్, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో కూడిన డార్క్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘AH’ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీతో పాటు తాజాగా వచ్చిన కాన్సెప్ట్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.మరింత చదవండి

Source link