సింధూ తులానీ తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది హిందీ సినిమాతోనే. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ నటీనటులు నటించిన ‘మొహబ్బతే’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత శింబు హీరోగా నటించిన ‘మన్మధన్’ సినిమాలో కొంత బోల్డ్‌గా ఉండే పాత్రతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ‘ఐతే’, ‘అతనొక్కడే’, ‘గౌతమ్ SSC’, ‘హరే రామ్’ వంటి సినిమాలు సింధూ తులానీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాగే ‘కిక్’, ‘ప్రేమకావాలి’, ‘ఇష్క్’, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తనదైన ముద్ర వేసుకుంది.

