వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’అక్టోబరు 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించగా.. ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సాయి బాలి దర్శకత్వంలో రాహుల్ విజయ్, అర్చన అయ్యర్ జంటగా నటించిన మిస్టరీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ ‘అ’. (AH Movie) అక్టోబరు 30న రిలీజ్ కానుంది. కనకరావు తొనంగి, అభిషేక్, ప్రముఖ ఎడిటర్-డైరెక్టర్ గ్యారీ BH ఈ సినిమాను నిర్మించారు. ‘అమ్మాయి, అదృశ్యం, అన్వేషణ’ చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించారు.
విష్వక్‌సేన్ హీరోగా నటిస్తూనే దర్శకత్వం ‘#కల్ట్’. (#Cult) సినిమా అక్టోబరు 30 న విడుదల కానుంది. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకర్ల నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ హీరోయిన్. తారక్ పొన్నప్ప, మురళీశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, కార్తికేయ, అనిరుధ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని కలవరపరిచే సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన సినిమా ఇది.
పూర్వజ్ దర్శకత్వంలో సీరియల్ నటి జ్యోతి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ (Killer) అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమెజాన్ ప్రైమ్..
అపోకలిప్స్ జెడ్: ది న్యూ వరల్డ్ (మూవీ) అక్టోబరు 30
నెట్‌ఫ్లిక్స్..
యూ, మీ అజ్ (మూవీ) అక్టోబరు 29
ది బర్త్‌డే గిఫ్ట్ (మూవీ) అక్టోబరు 30
కొలిషన్స్ కోర్స్ (మూవీ) అక్టోబరు 30
ఏ కపుల్ ఆఫ్ లైఫ్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 30
సోనీ లివ్..
ఇమ్మోర్టల్ (మూవీ) అక్టోబరు 30
జీ5..
‘హాస్టల్ హాద్సా’ (వెబ్‌సిరీస్) అక్టోబరు 28
ఈటీవీ విన్..
తెల్లకాగితం (మూవీ) అక్టోబరు 29
