Last Updated:
నేడు (సెప్టెంబర్ 4న) జగమే సంగీతం ఓటీటీ లోకి వచ్చేసింది. సీనియర్ నటులు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై మ్యూజికల్ డ్రామాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విజయవంతమైన హిందీ వెబ్ సిరీస్ ‘బండిష్ బ్యాండిట్స్’కు అధికారిక రీమేక్‌గా వచ్చిన తాజా తెలుగు వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’. నేడు (సెప్టెంబర్ 4న) ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌కు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించగా.. మధుబాల, అక్షయ్ లాగుసాని, సుస్మితా శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటించారు. హిందీ మాతృకలో హిందుస్థానీ సంగీతం నేపథ్యంగా ఉండగా, తెలుగులోకి వచ్చేసరికి దానిని దక్షిణాది సాంప్రదాయ కర్ణాటక సంగీతానికి అనుగుణంగా మార్పులు చేసి ఈ సిరీస్‌ను రూపొందించారు.

