Last Updated:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA). ఆది నుంచే ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
పాన్ ఇండియా రేంజ్లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘రాకా’ (RAAKA). ఆది నుంచే ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి సినిమాకు తన లుక్, బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటూ వైవిధ్యం చూపే బన్నీ, ఈ చిత్రంలో సరికొత్త అవతారంలో కనిపించనున్నారు. తాజాగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్కి సంబంధించి సినీ ప్రియులకు పూనకాలు తెప్పించే క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో థియేటర్లు దద్దరిల్లేలా సాగే ఓ మైండ్ బ్లోయింగ్ ఇంటర్వెల్ బ్లాక్‌ను మేకర్స్ డిజైన్ చేశారట.
సినిమా మొత్తానికే హైలైట్‌గా నిలిచే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను నవంబర్ మొదటి వారంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించేందుకు చిత్ర బృందం రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు బన్నీ కెరీర్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాలకు పూర్తి భిన్నంగా, అత్యంత సహజంగా (Raw and Rustic) ఉంటూనే, గూస్బంప్స్ తెప్పించే యాక్షన్ లెవెల్స్ ఉండేలా ఈ ఇంటర్వెల్ ఫైట్‌ను ప్లాన్ చేశారట. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే కోట్లు వెచ్చించి భారీ సెట్స్ నిర్మించడంతో పాటు, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టంట్ మాస్టర్ల నేతృత్వంలో ఈ ఫైట్ కంపోజ్ చేసినట్లు ఇన్సైడ్ టాక్.
ఈ కీలక షెడ్యూల్లో అల్లు అర్జున్‌తో పాటు దేశవిదేశాలకు చెందిన ప్రముఖ ఫైటర్లు, సినిమాలోని ప్రధాన తారాగణం పాల్గొనబోతున్నారు. తెరపై బన్నీ చేసే సరికొత్త స్టంట్స్, అతని యాటిట్యూడ్ ప్రేక్షకులకు మునుపెన్నడూ చూడని విజువల్ ట్రీట్ అందించడం ఖాయమని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు, తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘రాకా’ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘పుష్ప’ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో బన్నీ మార్కెట్ అమాంతం పెరగడంతో, దానికి తగ్గట్టుగానే మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘రాకా’ ఇంటర్వెల్ యాక్షన్ అప్డేట్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

