అంతేకాకుండా తులారాశిలో సూర్యుడు, శుక్రుడు కలిసి ఉండటంతో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుందని జ్యోతిష్య విశ్లేషణలు పేర్కొంటున్నాయి. ఈ ప్రత్యేక గ్రహాల కలయికల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితంలో అనుకూల ఫలితాలు కలగవచ్చని నమ్ముతారు. ముఖ్యంగా మేషం, తుల, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండవచ్చో తెలుసుకుందాం.

