ప్రభన్యూస్

Pradeep Rawat: ‘భిక్షు యాదవ్ ఇకలేరు’.. స్టార్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

దర్శక ధీరుడు రాజమౌళి ‘సై’ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందారు. 74 ఏళ్ల ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

News18
News18

సై సినిమాలో భిక్షు యాదవ్‌గా తెలుగు ప్రజలకు పరిచయమైన నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రదీప్.. మంగళారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగులో సై, ఛత్రపతి, గజిని, లక్ష్మీ, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు లాంటి సినిమాల్లో ప్రదీప్ నటించారు.  బాలీవుడ్‌లోనూ ‘లగాన్’, ‘గజినీ’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రదీప్ రావత్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.

మధ్యప్రదేశ్ నుంచి ముంబై

దాకా ప్రదీప్ రావత్ 1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. మొదట హిందీ సినిమాల ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందారు. బి.ఆర్. చోప్రా రూపొందించిన ఐకానిక్ సీరియల్ ‘మహాభారత్’లో అశ్వత్థామ పాత్ర ద్వారా ఆయన దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో వచ్చిన ‘మేరీ జంగ్’ సినిమాతో హిందీ సినీ రంగ ప్రవేశం చేశారు.

టాలీవుడ్‌లో ‘సై’ సంచలనం, ఫిలింఫేర్ అవార్డు

తెలుగు సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ సినిమాతో ప్రదీప్ రావత్ అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే భిక్షు యాదవ్‌గా తన క్రూరమైన నటనతో ప్రేక్షకులను భయపెట్టి, బెస్ట్ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి, స్టాలిన్, 1-నేనొక్కడినే, నేను శైలజ లాంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో కూడా నటించి బహుభాషా ప్రతినాయకుడిగా గుర్తింపు పొందారు.

బాలీవుడ్‌లో మైలురాళ్లు

హిందీలో సుదీర్ఘ కాలం సాగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించారు. 1999లో వచ్చిన ‘సర్ఫరోష్’లో సుల్తాన్ పాత్ర, 2001లో ‘లగాన్’లో దేవా సింగ్ సోధి పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ద హిరో (2003), గజిని (2008), గ్రాండ్ మస్తీ (2013), సింగ్ ఈజ్ బ్లింగ్ (2015), ఇటీవల వచ్చిన ఛావా (2025) చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. గజిని సినిమాలో ఒరిజినల్ తమిళ వర్షన్, హిందీ రీమేక్ రెండింట్లోనూ ఆయనే ప్రధాన ప్రతినాయకుడిగా నటించడం విశేషం.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 04 August 2026, 10:12 pm Digital Edition : Prabhanews
Pradeep Rawat: ‘భిక్షు యాదవ్ ఇకలేరు’.. స్టార్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 04, 2026 10:04 PM ISTదర్శక ధీరుడు రాజమౌళి 'సై' సినిమాలో భిక్షు యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందారు. 74 ఏళ్ల ఆయన బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.News18సై సినిమాలో భిక్షు యాదవ్‌గా తెలుగు ప్రజలకు పరిచయమైన నటుడు ప్రదీప్ రావత్ (74) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రదీప్.. మంగళారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుగులో సై, ఛత్రపతి, గజిని, లక్ష్మీ, భద్ర, యోగి, దేశముదురు, అందరివాడు లాంటి సినిమాల్లో ప్రదీప్ నటించారు.  బాలీవుడ్‌లోనూ 'లగాన్', 'గజినీ' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రదీప్ రావత్ మరణ వార్త తెలిసి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది.మధ్యప్రదేశ్ నుంచి ముంబైదాకా ప్రదీప్ రావత్ 1952 జనవరి 21న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జన్మించారు. మొదట హిందీ సినిమాల ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత బుల్లితెరపై విశేష ప్రజాదరణ పొందారు. బి.ఆర్. చోప్రా రూపొందించిన ఐకానిక్ సీరియల్ 'మహాభారత్'లో అశ్వత్థామ పాత్ర ద్వారా ఆయన దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1985లో వచ్చిన 'మేరీ జంగ్' సినిమాతో హిందీ సినీ రంగ ప్రవేశం చేశారు.టాలీవుడ్‌లో 'సై' సంచలనం, ఫిలింఫేర్ అవార్డుతెలుగు సినీ పరిశ్రమలో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'సై' సినిమాతో ప్రదీప్ రావత్ అడుగుపెట్టారు. తొలి సినిమాలోనే భిక్షు యాదవ్‌గా తన క్రూరమైన నటనతో ప్రేక్షకులను భయపెట్టి, బెస్ట్ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఛత్రపతి, స్టాలిన్, 1-నేనొక్కడినే, నేను శైలజ లాంటి విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషలతో పాటు కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో కూడా నటించి బహుభాషా ప్రతినాయకుడిగా గుర్తింపు పొందారు.బాలీవుడ్‌లో మైలురాళ్లుహిందీలో సుదీర్ఘ కాలం సాగిన ఆయన ప్రయాణంలో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించారు. 1999లో వచ్చిన 'సర్ఫరోష్'లో సుల్తాన్ పాత్ర, 2001లో 'లగాన్'లో దేవా సింగ్ సోధి పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ద హిరో (2003), గజిని (2008), గ్రాండ్ మస్తీ (2013), సింగ్ ఈజ్ బ్లింగ్ (2015), ఇటీవల వచ్చిన ఛావా (2025) చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు. గజిని సినిమాలో ఒరిజినల్ తమిళ వర్షన్, హిందీ రీమేక్ రెండింట్లోనూ ఆయనే ప్రధాన ప్రతినాయకుడిగా నటించడం విశేషం.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Telanganaమరింత చదవండి

Source link