ఎండోమెంట్ అష్యూరెన్స్ – గ్రామ సంతోష్: గ్రామ సంతోష్ అనేది ఎండోమెంట్ అష్యూరెన్స్ ప్లాన్. ఇందులో ముందుగా నిర్ణయించిన మెచ్యూరిటీ వయసు వచ్చినప్పుడు సమ్ అష్యూర్డ్‌తో పాటు వచ్చిన బోనస్‌ను పాలసీదారుడికి చెల్లిస్తారు. మెచ్యూరిటీ వయసుగా 35, 40, 45, 50, 55, 58, 60 ఏళ్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఈ పాలసీకి ఎంట్రీ ఏజ్ 19 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటుంది. కనీస సమ్ అష్యూర్డ్ రూ.10,000 కాగా, గరిష్టంగా రూ.10 లక్షలు ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత లోన్ ఫెసిలిటీ, 3 ఏళ్ల తర్వాత సరెండర్ ఫెసిలిటీ ఉంటాయి. 5 ఏళ్లలోపు పాలసీని సరెండర్ చేస్తే బోనస్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. అర్హత ఉన్న సరెండర్ సందర్భాల్లో తగ్గిన సమ్ అష్యూర్డ్‌పై ప్రొపోర్షనేట్ బోనస్ చెల్లిస్తారు. చివరిగా ప్రకటించిన బోనస్ ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్‌కు ఏడాదికి రూ.48గా ఉంది. పాలసీదారుడు మరణిస్తే, పాలసీ నిబంధనలకు లోబడి వర్తించే సమ్ అష్యూర్డ్, వచ్చిన బోనస్‌ను అసైనీ, నామినీ లేదా లీగల్ హెయిర్‌కు చెల్లిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
