Last Updated:
Volkswagen Job Cuts: ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ దశాబ్దం చివరి నాటికి ఏకంగా 1 లక్ష ఉద్యోగాలను తగ్గించేందుకు యాజమాన్యం, కార్మిక సంఘాలు అంగీకరించాయి. అమెరికా టారిఫ్‌ల ప్రభావం, ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్‌లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ వంటి కారణాలతో ఈ భారీ పునర్వ్యవస్థీకరణకు సంస్థ సిద్ధమైంది. ఉద్యోగాల కోతతో పాటు జర్మనీలోని నాలుగు ప్లాంట్ల భవిష్యత్తుపైనా అనిశ్చితి నెలకొంది.
ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ చరిత్రలోనే కనీవినీ ఎరుగని ఒక సంచలన నిర్ణయాన్ని ప్రముఖ జర్మన్ కార్ల తయారీ దిగ్గజం ‘వోక్స్వ్యాగన్’ (Volkswagen) ప్రకటించింది. మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, నష్టాల ఊబికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ఈ దశాబ్దం చివరి నాటికి ఏకంగా ఒక లక్ష (1,00,000) ఉద్యోగాలను తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ భారీ లేఆఫ్స్‌కు యాజమాన్యం, కార్మిక సంఘాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు గురువారం సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఆటోమోటివ్ రంగ చరిత్రలో ఒక సంస్థ ఇంత పెద్ద స్థాయిలో పునర్వ్యవస్థీకరణ (Restructuring) చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

