ప్రభన్యూస్

Polimera 3 Movie: ‘పొలిమేర 3’ మూవీ.. ‘విరావి’గా యాక్షన్ కింగ్ అర్జున్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్! | తెలుగు సినిమా వార్తలు


ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై ఆటోమేటిగ్‌గా బజ్ క్రియేట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజైనా.. సీక్వెల్ మాత్రం థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. రెండేళ్ల కిందట పీక్స్ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. మొదటి పార్ట్‌ని మించిన ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌ను కూర్చోబెట్టింది. అంతేకాదు కమర్షియల్‌గా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టు రాబోతుంది.

మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘పొలిమేర’ సిరీస్ నుంచి మూడో సినిమాగా వస్తున్న ఈ పార్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న ‘విరావి’ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా శక్తిమంతమైన, ఆసక్తికరమైన లుక్‌లో కనిపించారు.

డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆలయంలోని చీకటి ప్రదేశాలను చూపిస్తూ గ్లింప్స్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అమావాస్య వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మికత, మిస్టరీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సినిమా సాగనున్నట్లు ఈ దృశ్యాలు తెలియజేస్తున్నాయి.

ఆ తర్వాత దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రేక్షకులను ‘పొలిమేర’ చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్తారు. కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు ఉత్కంఠను పెంచుతాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న ‘విరావి’ పాత్రను పరిచయం చేశారు.

యోధుడి వేషధారణలో, చేతిలో కత్తితో అర్జున్ సర్జా కనిపించిన తీరు గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన గంభీరమైన రూపం, హావభావాలు పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. ‘బ్లాస్ట్’తో వచ్చిన గుర్తింపు తర్వాత అర్జున్ సర్జా ఈ ఫ్రాంచైజీలో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

గ్లింప్స్‌లో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే చీకటి ప్రపంచం నుంచి అర్జున్ సర్జా యోధుడి రూపాన్ని ఆవిష్కరించిన విధానం ప్రత్యేకంగా నిలిచింది.

‘మా ఊరి పొలిమేర’ చిత్రం తొలుత ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన ‘పొలిమేర 2’ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని ఈ ఫ్రాంచైజీకి మరింత గుర్తింపు తీసుకొచ్చింది.

ఇప్పుడు మూడో భాగంలో అర్జున్ సర్జా చేరడంతో పాటు నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటోంది. గత రెండు చిత్రాల విజయాలు, దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథనశైలి, అర్జున్ సర్జా పాత్ర ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రంలో సత్యం రాజేశ్ మరోసారి కొమరయ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి రెండు భాగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘పొలిమేర’ ఫ్రాంచైజీని మూడో భాగంతో మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 9:26 pm Digital Edition : Prabhanews
Polimera 3 Movie: ‘పొలిమేర 3’ మూవీ.. ‘విరావి’గా యాక్షన్ కింగ్ అర్జున్.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్! | తెలుగు సినిమా వార్తలు

ఇక ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో సీక్వెల్‌పై ఆటోమేటిగ్‌గా బజ్ క్రియేట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్ నేరుగా ఓటీటీలో రిలీజైనా.. సీక్వెల్ మాత్రం థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. సత్యం రాజేశ్‌, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను ప్రధాన పాత్రల్లో నటించారు. రెండేళ్ల కిందట పీక్స్ అంచనాలతో రిలీజైన ఈ సినిమా.. మొదటి పార్ట్‌ని మించిన ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ని సీట్ ఎడ్జ్‌ను కూర్చోబెట్టింది. అంతేకాదు కమర్షియల్‌గా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో పార్టు రాబోతుంది.మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' సిరీస్ నుంచి మూడో సినిమాగా వస్తున్న ఈ పార్ట్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న 'విరావి' పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ గ్లింప్స్‌లో అర్జున్ సర్జా శక్తిమంతమైన, ఆసక్తికరమైన లుక్‌లో కనిపించారు.డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వంశీ నందిపాటి, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్)కు చెందిన భరత్ నారంగ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఆలయంలోని చీకటి ప్రదేశాలను చూపిస్తూ గ్లింప్స్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. అమావాస్య వాతావరణాన్ని ఆవిష్కరిస్తూ విష్ణుమూర్తి నుంచి పరమశివుడికి మారే దృశ్యాలు, అనంత పద్మనాభస్వామి దర్శనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆధ్యాత్మికత, మిస్టరీ, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సినిమా సాగనున్నట్లు ఈ దృశ్యాలు తెలియజేస్తున్నాయి.ఆ తర్వాత దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ప్రేక్షకులను 'పొలిమేర' చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్తారు. కొమరయ్య పాత్రలో సత్యం రాజేశ్ క్షుద్రపూజలు చేస్తున్న దృశ్యాలు ఉత్కంఠను పెంచుతాయి. ఈ నేపథ్యంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పోషిస్తున్న 'విరావి' పాత్రను పరిచయం చేశారు.యోధుడి వేషధారణలో, చేతిలో కత్తితో అర్జున్ సర్జా కనిపించిన తీరు గ్లింప్స్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయన గంభీరమైన రూపం, హావభావాలు పాత్రపై ఆసక్తిని పెంచుతున్నాయి. 'బ్లాస్ట్'తో వచ్చిన గుర్తింపు తర్వాత అర్జున్ సర్జా ఈ ఫ్రాంచైజీలో భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.గ్లింప్స్‌లో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే చీకటి ప్రపంచం నుంచి అర్జున్ సర్జా యోధుడి రూపాన్ని ఆవిష్కరించిన విధానం ప్రత్యేకంగా నిలిచింది.'మా ఊరి పొలిమేర' చిత్రం తొలుత ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందింది. వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన 'పొలిమేర 2' బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని ఈ ఫ్రాంచైజీకి మరింత గుర్తింపు తీసుకొచ్చింది.ఇప్పుడు మూడో భాగంలో అర్జున్ సర్జా చేరడంతో పాటు నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమవుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటోంది. గత రెండు చిత్రాల విజయాలు, దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథనశైలి, అర్జున్ సర్జా పాత్ర ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.ఈ చిత్రంలో సత్యం రాజేశ్ మరోసారి కొమరయ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయనతో పాటు కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి రెండు భాగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న 'పొలిమేర' ఫ్రాంచైజీని మూడో భాగంతో మరింత విస్తృతమైన ప్రేక్షకులకు చేరువ చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Source link