Last Updated:
దసరా పండక్కు నాలుగు రోజులు ముందు రిలీజైన క్రేజీ కళ్యాణం సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నరేష్ రోల్‌కు, పర్ఫార్మెన్స్కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే పోటీగా జైలర్2, రణబాలి వంటి సినిమాలు ఉండటంతో కమర్షియల్‌గా భారీ హిట్టు కాలేకపోయింది.
దసరా పండక్కు నాలుగు రోజులు ముందు రిలీజైన క్రేజీ కళ్యాణం సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నరేష్ రోల్‌కు, పర్ఫార్మెన్స్కు జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే పోటీగా జైలర్2, రణబాలి వంటి సినిమాలు ఉండటంతో కమర్షియల్‌గా భారీ హిట్టు కాలేకపోయింది. అలా అని ఫ్లాప్ కూడా కాలేదు. మేకర్స్ మాత్రం సేఫ్ సైడ్ అయ్యారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. కాగా.. నవంబర్ 13 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.
కథ విషయానికి వస్తే.. మెదక్ ప్రాంతంలోని ఓ గ్రామంలో పర్వతాలు తన కుటుంబంతో కలిసి జీవిస్తుంటాడు. పెద్దల్లుడు బాలరాజు తాగుడుకు బానిసై కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తుంటాడు. దీంతో చిన్న కూతురు కీర్తికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని పర్వతాలు అనుకుంటాడు. కానీ కీర్తి మాత్రం ఉద్యోగం సాధించి తన కాళ్లపై తాను నిలబడాలని కోరుకుంటుంది. మరోవైపు ఉదయ్‌ను ప్రేమిస్తుంది. మరి తండ్రి ఆశయాలకు, తన కలలకు మధ్య కీర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తన ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? అనేదే సినిమా కథ.
ఈ సినిమాలో ముఖ్యంగా నచ్చే విషయం ఆడపిల్లల చదువు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ప్రాముఖ్యతను చక్కగా చెప్పాలనుకోవడం. పెళ్లి చేయడమే తల్లిదండ్రుల బాధ్యత కాదని, అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించాలని చెప్పే సందేశం బాగుంది. కుటుంబ గౌరవం, పిల్లల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశలు వంటి అంశాలను కథలో భాగంగా చూపించారు. ఫస్టాఫ్‌లో నరేష్, తరుణ్ భాస్కర్ మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ తన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేశాడు.
సెకండాఫ్‌లో కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోని కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి. మధ్యతరగతి కుటుంబాల్లో కూతురి పెళ్లి కోసం తల్లిదండ్రులు పడే ఆరాటాన్ని చూపించిన విధానం కూడా కనెక్ట్ అవుతుంది. కథలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినా, కుటుంబ విలువలు, అమ్మాయిల భవిష్యత్తు గురించి చెప్పే సందేశం సినిమాకు ప్రత్యేకతను తీసుకొస్తుంది.

