ప్రభన్యూస్

PM Modi: ఎడ్లబండి నుంచి బుల్లెట్ రైలు వరకు భారత్ ప్రస్థానం.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! |


Last Updated:

ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఎడ్లబండి స్థాయి నుంచి బుల్లెట్ రైలు వరకు సాగిన భారత ప్రగతి ప్రస్థానంలో ఈ సంస్థ పాత్ర ఎంతో కీలకమన్నారు.

News18
News18

దేశంలోనే తొలి ఐఐటీగా పేరొందిన ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఇక్కడే కొలువుదీరాయని కొనియాడారు. 1951లో ఐఐటీ ఖరగ్‌పూర్ స్థాపించినప్పటి నుంచి సంస్థ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని, అదే సమయంలో భారత్ కూడా ఎడ్లబండి యుగం నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, పోస్ట్ కార్డుల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు అద్భుతమైన పరివర్తన చెందిందని పేర్కొన్నారు.

ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ ప్రాంగణంలోనే ఈ విద్యాసంస్థ ఏర్పాటైందని గుర్తుచేసిన మోదీ, ఆ వీరుల ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటికీ ఈ వాతావరణంలో ప్రతిధ్వనిస్తూ యువతకు ప్రేరణనిస్తున్నాయని అన్నారు. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో భాగస్వాములైన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులకు ప్రధాని హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అంతరిక్షం, అణుశక్తి, ఐటీ రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ ముద్ర

స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, తొలి సార్వత్రిక ఎన్నికలు కూడా జరగకముందే ఈ సంస్థ ప్రయాణం మొదలైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆ సమయంలో దేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇంజనీర్లు ఎంతో అవసరమయ్యారని, ఆ బాధ్యతను ఇక్కడి విద్యార్థులు సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. ఆ తర్వాత భారత్ అంతరిక్షం, అణుశక్తి కార్యక్రమాల్లో అగ్రగామిగా ఎదగడంలోనూ ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

భారత సాఫ్ట్‌వేర్ రంగానికి వెన్నెముకగా నిలిచిన యువత

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విప్లవం మొదలైనప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమను బలోపేతం చేయడంలో ఈ సంస్థ విద్యార్థులు ముందువరుసలో నిలిచారని మోదీ ప్రశంసించారు. యువ మేధస్సు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, వికసిత భారత్ నిర్మాణంలో ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 November 2026, 3:14 pm Digital Edition : Prabhanews
PM Modi: ఎడ్లబండి నుంచి బుల్లెట్ రైలు వరకు భారత్ ప్రస్థానం.. ఐఐటీ ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు! |

Last Updated:Nov 21, 2026 2:45 PM ISTఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ, ఎడ్లబండి స్థాయి నుంచి బుల్లెట్ రైలు వరకు సాగిన భారత ప్రగతి ప్రస్థానంలో ఈ సంస్థ పాత్ర ఎంతో కీలకమన్నారు.News18దేశంలోనే తొలి ఐఐటీగా పేరొందిన ఐఐటీ ఖరగ్‌పూర్ 75 ఏళ్ల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఇక్కడే కొలువుదీరాయని కొనియాడారు. 1951లో ఐఐటీ ఖరగ్‌పూర్ స్థాపించినప్పటి నుంచి సంస్థ ఎన్నో మైలురాళ్లను అధిగమించిందని, అదే సమయంలో భారత్ కూడా ఎడ్లబండి యుగం నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, పోస్ట్ కార్డుల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు అద్భుతమైన పరివర్తన చెందిందని పేర్కొన్నారు.ఒకప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను బంధించిన హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ ప్రాంగణంలోనే ఈ విద్యాసంస్థ ఏర్పాటైందని గుర్తుచేసిన మోదీ, ఆ వీరుల ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటికీ ఈ వాతావరణంలో ప్రతిధ్వనిస్తూ యువతకు ప్రేరణనిస్తున్నాయని అన్నారు. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో భాగస్వాములైన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులకు ప్రధాని హృదయపూర్వక అభినందనలు తెలిపారు.అంతరిక్షం, అణుశక్తి, ఐటీ రంగాల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ ముద్రస్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో, తొలి సార్వత్రిక ఎన్నికలు కూడా జరగకముందే ఈ సంస్థ ప్రయాణం మొదలైందని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఆ సమయంలో దేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఇంజనీర్లు ఎంతో అవసరమయ్యారని, ఆ బాధ్యతను ఇక్కడి విద్యార్థులు సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపారు. ఆ తర్వాత భారత్ అంతరిక్షం, అణుశక్తి కార్యక్రమాల్లో అగ్రగామిగా ఎదగడంలోనూ ఐఐటీ ఖరగ్‌పూర్ గ్రాడ్యుయేట్లు కీలక పాత్ర పోషించారని కొనియాడారు.
There are no limits to what young minds can achieve. Speaking at the Platinum Jubilee celebrations of IIT Kharagpur. @IITKgp https://t.co/VkB3UO2Rkn
— Narendra Modi (@narendramodi) November 21, 2026భారత సాఫ్ట్‌వేర్ రంగానికి వెన్నెముకగా నిలిచిన యువతప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విప్లవం మొదలైనప్పుడు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమను బలోపేతం చేయడంలో ఈ సంస్థ విద్యార్థులు ముందువరుసలో నిలిచారని మోదీ ప్రశంసించారు. యువ మేధస్సు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, వికసిత భారత్ నిర్మాణంలో ఐఐటీ విద్యార్థుల ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.మరింత చదవండి

Source link