Last Updated:
Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 30కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి సవరిస్తుంటాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా ఇంధన ధరలను ప్రకటిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, రవాణా వ్యయాలు, స్థానిక పన్నులు వంటి అంశాల ఆధారంగా ధరలు నిర్ణయించబడతాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 30కు సంబంధించిన తాజా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయా సంస్థలు విడుదల చేశాయి.

