Last Updated:
AP Telangana Petrol Diesel Price Today July 15: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో క్రూడ్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. యుద్ధం భీకరంగా మారితే క్రూడ్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో వచ్చే హెచ్చుతగ్గులను ఆధారంగా చేసుకుని దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తుంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హెచ్‌పీసీఎల్ వంటి ప్రభుత్వ చమురు సంస్థలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా ఇంధన ధరలను ప్రకటిస్తాయి. ఈ నేపథ్యంలో జూలై 15న తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను ఆయా సంస్థలు విడుదల చేశాయి. గత కొన్ని రోజులుగా ధరలు పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతుండగా, ఈరోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో అదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించిన ధరల ప్రకారం.. మొదట తెలంగాణ విషయానికి వస్తే, రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.25గా కొనసాగుతోంది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.104.96గా ఉంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో మాత్రం స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్ల ధరల్లో స్వల్ప మార్పులు కనిపించవచ్చు. అయితే పెద్ద ఎత్తున ధరల పెరుగుదల లేదా తగ్గుదల నమోదు కాలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంధన ధరలు దాదాపు స్థిరంగానే ఉన్నాయి. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.69గా ఉండగా, డీజిల్ ధర రూ.103.82గా విక్రయిస్తున్నారు. మరోవైపు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.39గా నమోదైంది. అక్కడ డీజిల్ ధర లీటర్‌కు రూ.104.11గా కొనసాగుతోంది. నగరాలను బట్టి స్థానిక పన్నుల కారణంగా ధరల్లో కొంత వ్యత్యాసం ఉండటం సాధారణ విషయమే.
వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పెట్రోల్, డీజిల్ తాజా ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వస్తాయి. అందువల్ల ఇంధనం నింపించుకునే ముందు మీ ప్రాంతంలో అమలులో ఉన్న తాజా ధరలను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. దీనివల్ల ఖచ్చితమైన ధరలపై అవగాహన ఉంటుంది.
మీ నగరంలోని ఇండియన్ ఆయిల్ బంకుల్లో అమలులో ఉన్న తాజా ధరలను మొబైల్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు. ఇందుకోసం RSP <స్పేస్> డీలర్ కోడ్ టైప్ చేసి 92249 92249 నంబర్‌కు SMS పంపాలి. హైదరాబాద్‌కు 127611, విజయవాడకు 134483, విశాఖపట్నానికి 127290 డీలర్ కోడ్లను ఉపయోగించాలి. వెంటనే మీ ప్రాంతంలోని లైవ్ పెట్రోల్, డీజిల్ ధరల వివరాలు మీ మొబైల్‌కు సందేశంగా అందుతాయి. దీంతో ప్రతి రోజు ఇంధన ధరలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Hyderabad,Telangana

