ప్రభన్యూస్

Pavala Shyamala Death: MAA సొంత ఖర్చులతో పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

టాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సాయంగా ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. కరాటే కళ్యాణి స్వయంగా ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనుంది.

News18
News18

టాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. జూలై 28, 2026 అర్ధరాత్రి 1:52 గంటలకు తీవ్ర గుండెపోటు (హార్ట్ అటాక్) కారణంగా ఆమె మరణించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. తనదైన హాస్యం, క్యారెక్టర్ నటనతో ప్రేక్షకులను నవ్వించిన పావలా శ్యామల ఇక లేరు అని తెలిసి టాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో జీవన పోరాటం సాగించి చివరకు తుది శ్వాస విడిచారు. మరోవైపు పావలా శ్యామల కూతురు కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సాయంగా ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించబోతోంది. కరాటే కళ్యాణి స్వయంగా ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. పావలా శ్యామల అనారోగ్యంగా ఉందని తెలిసిన మొదటి నుంచి, ఆవిడ గురించి తెలుసుకుంటూ ఎన్నో విషయాలలో సపోర్ట్ చేశాం. ఎన్నో వృద్ధాశ్రమాలలో ఆమెను జాయిన్ చేసి ఆశ్రమం కలిపించాం. ఈ కారణంగానే ఈ బాధ్యతను నాకు ఇచ్చారు అని కరాటే కళ్యాణి చెప్పారు.

పావలా శ్యామల (అసలు పేరు నేతి శ్యామల) 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. రంగస్థల నటిగా ప్రారంభించి, 1980ల నుంచి తెలుగు సినిమాల్లో సహాయ, హాస్య పాత్రలు పోషించారు. *బాబాయి అబ్బాయి*, *స్వర్ణకమలం*, *ఖడ్గం*, *వర్షం*, *అంధ్రవాలా*, *గోలీమార్* వంటి చిత్రాల్లో నటించి సుమారు 300కి పైగా సినిమాల్లో కనిపించారు.

చివరి రోజుల్లో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలు, గుండె సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమె కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చిరంజీవి, అల్లు అర్జున్, దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఆర్థిక సాయం అందించినా, పరిస్థితి మెరుగుపడలేదు. 2026 మేలో ఆస్పత్రి నుంచి తిప్పి పంపబడి రోడ్డుపై కనిపించిన ఘటన కూడా వార్తల్లో వచ్చింది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 28 July 2026, 2:51 pm Digital Edition : Prabhanews
Pavala Shyamala Death: MAA సొంత ఖర్చులతో పావలా శ్యామల అంత్యక్రియలు.. బాధ్యత తీసుకున్న కరాటే కళ్యాణి | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 28, 2026 12:48 PM ISTటాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సాయంగా ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. కరాటే కళ్యాణి స్వయంగా ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనుంది. News18టాలీవుడ్ నటి సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. జూలై 28, 2026 అర్ధరాత్రి 1:52 గంటలకు తీవ్ర గుండెపోటు (హార్ట్ అటాక్) కారణంగా ఆమె మరణించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. తనదైన హాస్యం, క్యారెక్టర్ నటనతో ప్రేక్షకులను నవ్వించిన పావలా శ్యామల ఇక లేరు అని తెలిసి టాలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో జీవన పోరాటం సాగించి చివరకు తుది శ్వాస విడిచారు. మరోవైపు పావలా శ్యామల కూతురు కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె అంత్యక్రియల నిర్వహణకు తమ వంతు సాయంగా ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించబోతోంది. కరాటే కళ్యాణి స్వయంగా ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు ఆమె ఓ వీడియో ద్వారా తెలిపారు. పావలా శ్యామల అనారోగ్యంగా ఉందని తెలిసిన మొదటి నుంచి, ఆవిడ గురించి తెలుసుకుంటూ ఎన్నో విషయాలలో సపోర్ట్ చేశాం. ఎన్నో వృద్ధాశ్రమాలలో ఆమెను జాయిన్ చేసి ఆశ్రమం కలిపించాం. ఈ కారణంగానే ఈ బాధ్యతను నాకు ఇచ్చారు అని కరాటే కళ్యాణి చెప్పారు.పావలా శ్యామల (అసలు పేరు నేతి శ్యామల) 1951లో గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. రంగస్థల నటిగా ప్రారంభించి, 1980ల నుంచి తెలుగు సినిమాల్లో సహాయ, హాస్య పాత్రలు పోషించారు. *బాబాయి అబ్బాయి*, *స్వర్ణకమలం*, *ఖడ్గం*, *వర్షం*, *అంధ్రవాలా*, *గోలీమార్* వంటి చిత్రాల్లో నటించి సుమారు 300కి పైగా సినిమాల్లో కనిపించారు.చివరి రోజుల్లో ఆమె తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలు, గుండె సమస్యలతో జీవన పోరాటం సాగించారు. ఆమె కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గతంలో చిరంజీవి, అల్లు అర్జున్, దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్ వంటి వారు ఆర్థిక సాయం అందించినా, పరిస్థితి మెరుగుపడలేదు. 2026 మేలో ఆస్పత్రి నుంచి తిప్పి పంపబడి రోడ్డుపై కనిపించిన ఘటన కూడా వార్తల్లో వచ్చింది.Click here to add News18 as your preferred news source on Google. సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.Location :Hyderabad,Hyderabad,TelanganaFirst Published :Jul 28, 2026 12:48 PM ISTమరింత చదవండి

Source link