గుమ్మడికాయ గింజలు (Pumpkin Seeds) పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాల్లో ఒకటి. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అనేక పోషకాలు ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, రోగనిరోధక శక్తిని పెంచడం, బరువు నియంత్రణలో సహాయపడటం వంటి ప్రయోజనాల కోసం చాలామంది వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు.

