Last Updated:
పాలకూరతో రుచికరమైన వంటకాలు తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఆసక్తిగా తినే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి పాలకూరతో కరకరలాడే పాలక్ వడలు తయారు చేసి చూడండి.
పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఇనుము, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి పోషకాలు లభిస్తాయి. అయితే పాలకూరను నేరుగా కూరగా వండితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి సమయంలో పాలకూరతో రుచికరమైన వంటకాలు తయారు చేసి పెడితే పిల్లలు కూడా ఆసక్తిగా తినే అవకాశం ఉంటుంది. అందుకే ఈసారి పాలకూరతో కరకరలాడే పాలక్ వడలు తయారు చేసి చూడండి. ఇవి సాయంత్రం స్నాక్‌గా మాత్రమే కాకుండా టీ, కాఫీతో కూడా బాగుంటాయి. తయారు చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం.

