డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనడం, అమ్మడం, భద్రపరచుకునే అవకాశం కల్పించే సేఫ్‌గోల్డ్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు, సీఓఓ రియా ఛటర్జీ ఈ విషయంపై మాట్లాడారు. గతంలో ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాల్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా బంగారం డిపాజిట్ చేయడానికి కనీస పరిమితి ఎక్కువగా ఉండటం, కస్టమర్లకు అనుకూలమైన డిపాజిట్ ఆప్షన్లు లేకపోవడం, అవసరమైనప్పుడు డబ్బుగా మార్చుకునే సౌకర్యం పరిమితంగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సేఫ్‌గోల్డ్ పాత బంగారు ఆభరణాల లీజింగ్ సదుపాయాన్ని అందిస్తోంది. నాణేలు, విరిగిపోయిన ఆభరణాలు వంటి వాటిని కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు భాగస్వామ్య స్టోర్ల ద్వారా ఈ విధానంలో ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తోంది. సేఫ్‌గోల్డ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్, భాగస్వామ్య నెట్‌వర్క్ ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా కస్టమర్లు గోల్డ్ లీజింగ్ సదుపాయాన్ని ఎంచుకున్నారని రియా ఛటర్జీ తెలిపారు. అదే సమయంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో చేరిన రిటైల్ కస్టమర్ల సంఖ్య సుమారు 7,000 మాత్రమేనని చెప్పారు. (ప్రతీకాత్మక చిత్రం)

