ప్రభన్యూస్

Nobel Prize 2026: రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం.. హెన్రీ కాగన్, కెన్సో సోవాయిలకు దక్కిన అంతర్జాతీయ గౌరవం! |


Last Updated:

అసమాన సేంద్రీయ సంశ్లేషణ రంగంలో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటాలిసిస్ ఆవిష్కరణలకు గాను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు హెన్రీ బి. కాగన్, కెన్సో సోవాయిలకు 2026 రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది.

News18
News18

రసాయన శాస్త్రంలో అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి-2026 విజేతలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో అధికారికంగా ప్రకటించింది. అసమాన సేంద్రీయ సంశ్లేషణ (Asymmetric Organic Synthesis) ప్రక్రియలో నాన్-లీనియర్ ప్రభావాలు, ఆటోకాటాలిసిస్ రంగాల్లో అద్భుతమైన పరిశోధనలు చేసినందుకు గాను శాస్త్రవేత్తలు హెన్రీ బి. కాగన్, కెన్సో సోవాయిలను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పరమాణువుల అమరిక, మిర్రర్-ఇమేజ్ అణువులను నియంత్రించడంలో వీరు చేసిన నూతన ఆవిష్కరణలు ఆధునిక రసాయన శాస్త్ర విప్లవానికి బాటలు వేశాయని నోబెల్ కమిటీ ప్రశంసించింది. సుమారు 1.2 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ఇద్దరు విజేతలు పంచుకోనున్నారు.

ఔషధ రంగానికి దక్కిన సరికొత్త ఊతం

వీరి పరిశోధనలు ప్రత్యేకించి అధునాతన ఔషధాల తయారీ రంగంలో సరికొత్త పుంతలు తొక్కేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి. రసాయన చర్యల సమయంలో ఒక నిర్దిష్టమైన అణు నిర్మాణాన్ని మాత్రమే తయారు చేసేందుకు వీరి అధ్యయనం స్పష్టమైన మార్గాన్ని చూపింది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులకు తయారుచేసే మందుల్లో దుష్ప్రభావాలను తగ్గించి, ఫలితాలను గణనీయంగా పెంచడం సాధ్యమైంది.

ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ కాగన్ అసమాన ఉత్ప్రేరక రంగంలో తొలిసారి నాన్-లీనియర్ ప్రభావాలను నిరూపించగా, జపాన్ శాస్త్రవేత్త కెన్సో సోవాయి రసాయన చర్యల్లో ఉత్పత్తి అయ్యే పదార్థమే తిరిగి ఉత్ప్రేరకంగా పనిచేసే ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేశారు. వీరిద్దరి సైద్ధాంతిక కృషి వల్ల జీవుల్లో కీలకమైన హోమోకైరాలిటీ మూలాలను అర్థం చేసుకోవడానికి సైన్స్‌కు బలమైన ఆధారాలు లభించాయి.

ఈ ఏడాది నోబెల్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం వైద్యశాస్త్రం, మంగళవారం భౌతికశాస్త్ర పురస్కారాలను ప్రకటించగా, మూడవ రోజైన బుధవారం రసాయన శాస్త్ర అవార్డును ఖరారు చేశారు. రాబోయే రోజుల్లో సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో అవార్డులను వరుసగా వెల్లడించనున్నారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందజేస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 07 October 2026, 4:07 pm Digital Edition : Prabhanews
Nobel Prize 2026: రసాయన శాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం.. హెన్రీ కాగన్, కెన్సో సోవాయిలకు దక్కిన అంతర్జాతీయ గౌరవం! |

Last Updated:Oct 07, 2026 3:54 PM ISTఅసమాన సేంద్రీయ సంశ్లేషణ రంగంలో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్, ఆటోకాటాలిసిస్ ఆవిష్కరణలకు గాను ప్రఖ్యాత శాస్త్రవేత్తలు హెన్రీ బి. కాగన్, కెన్సో సోవాయిలకు 2026 రసాయన శాస్త్ర నోబెల్ పురస్కారం లభించింది.News18రసాయన శాస్త్రంలో అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైన నోబెల్ బహుమతి-2026 విజేతలను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బుధవారం స్టాక్‌హోమ్‌లో అధికారికంగా ప్రకటించింది. అసమాన సేంద్రీయ సంశ్లేషణ (Asymmetric Organic Synthesis) ప్రక్రియలో నాన్-లీనియర్ ప్రభావాలు, ఆటోకాటాలిసిస్ రంగాల్లో అద్భుతమైన పరిశోధనలు చేసినందుకు గాను శాస్త్రవేత్తలు హెన్రీ బి. కాగన్, కెన్సో సోవాయిలను సంయుక్తంగా ఈ అవార్డుకు ఎంపిక చేసింది. పరమాణువుల అమరిక, మిర్రర్-ఇమేజ్ అణువులను నియంత్రించడంలో వీరు చేసిన నూతన ఆవిష్కరణలు ఆధునిక రసాయన శాస్త్ర విప్లవానికి బాటలు వేశాయని నోబెల్ కమిటీ ప్రశంసించింది. సుమారు 1.2 మిలియన్ డాలర్ల నగదు బహుమతిని ఇద్దరు విజేతలు పంచుకోనున్నారు.ఔషధ రంగానికి దక్కిన సరికొత్త ఊతంవీరి పరిశోధనలు ప్రత్యేకించి అధునాతన ఔషధాల తయారీ రంగంలో సరికొత్త పుంతలు తొక్కేందుకు ఎంతగానో తోడ్పడ్డాయి. రసాయన చర్యల సమయంలో ఒక నిర్దిష్టమైన అణు నిర్మాణాన్ని మాత్రమే తయారు చేసేందుకు వీరి అధ్యయనం స్పష్టమైన మార్గాన్ని చూపింది. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులకు తయారుచేసే మందుల్లో దుష్ప్రభావాలను తగ్గించి, ఫలితాలను గణనీయంగా పెంచడం సాధ్యమైంది.ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ కాగన్ అసమాన ఉత్ప్రేరక రంగంలో తొలిసారి నాన్-లీనియర్ ప్రభావాలను నిరూపించగా, జపాన్ శాస్త్రవేత్త కెన్సో సోవాయి రసాయన చర్యల్లో ఉత్పత్తి అయ్యే పదార్థమే తిరిగి ఉత్ప్రేరకంగా పనిచేసే ప్రక్రియను ప్రపంచానికి పరిచయం చేశారు. వీరిద్దరి సైద్ధాంతిక కృషి వల్ల జీవుల్లో కీలకమైన హోమోకైరాలిటీ మూలాలను అర్థం చేసుకోవడానికి సైన్స్‌కు బలమైన ఆధారాలు లభించాయి.ఈ ఏడాది నోబెల్ వారోత్సవాల్లో భాగంగా సోమవారం వైద్యశాస్త్రం, మంగళవారం భౌతికశాస్త్ర పురస్కారాలను ప్రకటించగా, మూడవ రోజైన బుధవారం రసాయన శాస్త్ర అవార్డును ఖరారు చేశారు. రాబోయే రోజుల్లో సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగాల్లో అవార్డులను వరుసగా వెల్లడించనున్నారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్థంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు బంగారు పతకం, ప్రశంసాపత్రంతో పాటు నగదు బహుమతిని అందజేస్తారు.మరింత చదవండి

Source link