ప్రభన్యూస్

Mahindra XUV Car: 10 లక్షల బడ్జెట్‌లో SUV కొనాలనుకుంటున్నారా? Mahindra XUV 3XO కొత్త వేరియంట్లు ఇవే! | బిజినెస్


కొత్త XUV 3XO REVX EDGE ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.39 లక్షలు. మరోవైపు పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే REVX EDGE (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. దీంతో రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలోనే మరిన్ని ఫీచర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను అందిస్తున్నామని మహీంద్రా తెలిపింది.

XUV 3XOకు 2.5 లక్షల అమ్మకాల మైలురాయి..

2024లో మార్కెట్లోకి వచ్చిన XUV 3XO తక్కువ సమయంలోనే మంచి విక్రయాలను సాధించిందని మహీంద్రా తెలిపింది. ఈ ఎస్‌యూవీ రెండున్నరేళ్ల వ్యవధిలో 2.5 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మహీంద్రా ఎస్‌యూవీగా XUV 3XO నిలిచిందని కంపెనీ పేర్కొంది. XUV 3XOలో డిజైన్‌తో పాటు ప్రీమియం ఇంటీరియర్, టెక్నాలజీ ఫీచర్లు, రైడ్ కంఫర్ట్, పనితీరు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొత్త REVX వేరియంట్ల ద్వారా ఇదే ఫీచర్లను మరింత విస్తృత కస్టమర్ వర్గానికి అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.

రెండు ఇంజిన్ ఆప్షన్లు..

కొత్త REVX EDGE వేరియంట్‌లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ mStallion TCMPFi పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ CRDe టర్బో డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా, డీజిల్ వేరియంట్‌లో మాన్యువల్, AMT ఆప్షన్లు ఉన్నాయి.

రూ.9.39 లక్షల REVX EDGEలో ఏమున్నాయి?

XUV 3XO REVX EDGEలో బయట నుంచి ప్రత్యేకమైన లుక్ కోసం డ్యూయల్-టోన్ రూఫ్, బాడీ కలర్/గన్‌మెటల్ గ్రిల్, బ్లాక్ వీల్ కవర్లు అందించారు. R16 స్టీల్ వీల్స్, బై-హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED సిగ్నేచర్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్ వంటి డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి. క్యాబిన్‌లో బ్లాక్ లెదరెట్ సీట్లు, 26.03 సెం.మీ. HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనికి వైర్‌లెస్ Android Auto, వైర్డ్ Apple CarPlay సపోర్ట్ ఇస్తున్నారు. నాలుగు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ముందు Type-A, Type-C ఛార్జింగ్ పోర్టులు, వెనుక Type-C ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. కంఫర్ట్ ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రియర్ కప్ హోల్డర్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రూ.9.89 లక్షల REVX EDGE (O)లో పనోరమిక్ సన్‌రూఫ్..

కొత్త వేరియంట్లలో ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఒకటి. XUV 3XO REVX EDGE (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో REVX EDGEలో ఉన్న ఫీచర్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ అయ్యే ORVMలు, పాసివ్ కీ-లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీనికి అదనంగా ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. దీంతో రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లను ఈ వేరియంట్ ఆకర్షించేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

భద్రతకు 35 స్టాండర్డ్ ఫీచర్లు..

కొత్త REVX EDGE, REVX EDGE (O) వేరియంట్లలో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రెండు వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, Electronic Stability Control (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.అలాగే అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ముందు సీట్ బెల్ట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది.

రూ.9.99 లక్షలకే పెట్రోల్ ఆటోమేటిక్..

XUV 3XO REVX శ్రేణిలో మరో ముఖ్యమైన మార్పు REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. అంటే రూ.10 లక్షల లోపు ధరలో REVX సిరీస్‌లో పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వేరియంట్లతో కస్టమర్లకు మాన్యువల్, AMT, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో పాటు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలు లభిస్తున్నాయి. దీంతో తమ అవసరం, డ్రైవింగ్ ప్రాధాన్యత, బడ్జెట్‌కు అనుగుణంగా వేరియంట్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.

ధరలు ఇలా ఉన్నాయంటే?

XUV 3XO REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.9.99 లక్షలు. REVX EDGE పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.39 లక్షలు కాగా, పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.10.59 లక్షలు. డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.59 లక్షలుగా ఉంది. REVX EDGE (O) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.89 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.11.09 లక్షలు కాగా, డీజిల్ మాన్యువల్ ధర రూ.11.09 లక్షలు. డీజిల్ AMT వేరియంట్ ధర రూ.11.91 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. కొత్త XUV 3XO REVX వేరియంట్లు ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, ట్యాంగో రెడ్, నెబ్యులా బ్లూ, గెలాక్సీ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటాయి. మొత్తంగా చూస్తే, తక్కువ ధర పరిధిలో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కనెక్టివిటీ ఫీచర్లు, భద్రతా సదుపాయాలు, పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్‌లను అందిస్తూ XUV 3XO REVX లైనప్‌ను మహీంద్రా మరింత విస్తరించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 September 2026, 6:08 pm Digital Edition : Prabhanews
Mahindra XUV Car: 10 లక్షల బడ్జెట్‌లో SUV కొనాలనుకుంటున్నారా? Mahindra XUV 3XO కొత్త వేరియంట్లు ఇవే! | బిజినెస్

కొత్త XUV 3XO REVX EDGE ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.39 లక్షలు. మరోవైపు పనోరమిక్ సన్‌రూఫ్‌తో వచ్చే REVX EDGE (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించారు. దీంతో రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలోనే మరిన్ని ఫీచర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను అందిస్తున్నామని మహీంద్రా తెలిపింది.XUV 3XOకు 2.5 లక్షల అమ్మకాల మైలురాయి..2024లో మార్కెట్లోకి వచ్చిన XUV 3XO తక్కువ సమయంలోనే మంచి విక్రయాలను సాధించిందని మహీంద్రా తెలిపింది. ఈ ఎస్‌యూవీ రెండున్నరేళ్ల వ్యవధిలో 2.5 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది. ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న మహీంద్రా ఎస్‌యూవీగా XUV 3XO నిలిచిందని కంపెనీ పేర్కొంది. XUV 3XOలో డిజైన్‌తో పాటు ప్రీమియం ఇంటీరియర్, టెక్నాలజీ ఫీచర్లు, రైడ్ కంఫర్ట్, పనితీరు, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. కొత్త REVX వేరియంట్ల ద్వారా ఇదే ఫీచర్లను మరింత విస్తృత కస్టమర్ వర్గానికి అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.రెండు ఇంజిన్ ఆప్షన్లు..కొత్త REVX EDGE వేరియంట్‌లో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.2 లీటర్ mStallion TCMPFi పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ CRDe టర్బో డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్‌తో మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉండగా, డీజిల్ వేరియంట్‌లో మాన్యువల్, AMT ఆప్షన్లు ఉన్నాయి.రూ.9.39 లక్షల REVX EDGEలో ఏమున్నాయి?XUV 3XO REVX EDGEలో బయట నుంచి ప్రత్యేకమైన లుక్ కోసం డ్యూయల్-టోన్ రూఫ్, బాడీ కలర్/గన్‌మెటల్ గ్రిల్, బ్లాక్ వీల్ కవర్లు అందించారు. R16 స్టీల్ వీల్స్, బై-హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, LED సిగ్నేచర్ ల్యాంప్స్, LED టెయిల్ ల్యాంప్స్ వంటి డిజైన్ అంశాలు కూడా ఉన్నాయి. క్యాబిన్‌లో బ్లాక్ లెదరెట్ సీట్లు, 26.03 సెం.మీ. HD ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. దీనికి వైర్‌లెస్ Android Auto, వైర్డ్ Apple CarPlay సపోర్ట్ ఇస్తున్నారు. నాలుగు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ముందు Type-A, Type-C ఛార్జింగ్ పోర్టులు, వెనుక Type-C ఛార్జింగ్ సదుపాయం కూడా ఉన్నాయి. కంఫర్ట్ ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, మాన్యువల్ డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్, రియర్ పవర్ విండోస్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, రియర్ కప్ హోల్డర్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.రూ.9.89 లక్షల REVX EDGE (O)లో పనోరమిక్ సన్‌రూఫ్..కొత్త వేరియంట్లలో ఎక్కువగా ఆకట్టుకునే ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్ ఒకటి. XUV 3XO REVX EDGE (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో REVX EDGEలో ఉన్న ఫీచర్లతో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, రూఫ్ రైల్స్, ఎలక్ట్రికల్‌గా ఫోల్డ్ అయ్యే ORVMలు, పాసివ్ కీ-లెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. దీనికి అదనంగా ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తాయి. దీంతో రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్న ఎస్‌యూవీని కోరుకునే కస్టమర్లను ఈ వేరియంట్ ఆకర్షించేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.భద్రతకు 35 స్టాండర్డ్ ఫీచర్లు..కొత్త REVX EDGE, REVX EDGE (O) వేరియంట్లలో భద్రతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రెండు వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, Electronic Stability Control (ESC), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.అలాగే అన్ని సీట్లకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్స్, సీట్ బెల్ట్ రిమైండర్లు, ముందు సీట్ బెల్ట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 35 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు అందిస్తున్నట్లు మహీంద్రా తెలిపింది.రూ.9.99 లక్షలకే పెట్రోల్ ఆటోమేటిక్..XUV 3XO REVX శ్రేణిలో మరో ముఖ్యమైన మార్పు REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. అంటే రూ.10 లక్షల లోపు ధరలో REVX సిరీస్‌లో పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త వేరియంట్లతో కస్టమర్లకు మాన్యువల్, AMT, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో పాటు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలు లభిస్తున్నాయి. దీంతో తమ అవసరం, డ్రైవింగ్ ప్రాధాన్యత, బడ్జెట్‌కు అనుగుణంగా వేరియంట్ ఎంచుకునే అవకాశం ఉంటుంది.ధరలు ఇలా ఉన్నాయంటే?XUV 3XO REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.9.99 లక్షలు. REVX EDGE పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.39 లక్షలు కాగా, పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.10.59 లక్షలు. డీజిల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ.10.59 లక్షలుగా ఉంది. REVX EDGE (O) పెట్రోల్ మాన్యువల్ ధర రూ.9.89 లక్షలు. పెట్రోల్ ఆటోమేటిక్ ధర రూ.11.09 లక్షలు కాగా, డీజిల్ మాన్యువల్ ధర రూ.11.09 లక్షలు. డీజిల్ AMT వేరియంట్ ధర రూ.11.91 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. కొత్త XUV 3XO REVX వేరియంట్లు ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్, ట్యాంగో రెడ్, నెబ్యులా బ్లూ, గెలాక్సీ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటాయి. మొత్తంగా చూస్తే, తక్కువ ధర పరిధిలో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కనెక్టివిటీ ఫీచర్లు, భద్రతా సదుపాయాలు, పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్‌లను అందిస్తూ XUV 3XO REVX లైనప్‌ను మహీంద్రా మరింత విస్తరించింది.

Source link