ఈ సెట్టింగ్ ఎలా ఆన్ చేయాలి?
చాలా Android ఫోన్లలో స్క్రీన్ పై నుంచి Quick Settings Panelను కిందికి లాగితే Battery Saver, Power Saving Mode వంటి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేస్తే ఈ ఫీచర్ వెంటనే యాక్టివేట్ అవుతుంది. మరో విధానంలో ఫోన్‌లో Settings → Battery → Battery Saver లేదా Power Saving Mode అనే ఆప్షన్‌లోకి వెళ్లి ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. Samsung, Xiaomi, OnePlus, Vivo, Oppo, Realme, Motorola వంటి వివిధ బ్రాండ్లలో సెట్టింగ్ పేరు, మెనూ మార్గం కొద్దిగా భిన్నంగా ఉండొచ్చు.

