Last Updated:
LPG Pipeline: దేశంలో ఎల్‌పీజీ సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా 1,800 కిలోమీటర్ల పైప్‌లైన్లు.. రూ.7,000 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్‌తో ఏం మారబోతోందో తెలుసా?
భారతదేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని దిగువ పెట్రోలియం, గ్యాస్ రంగ నియంత్రణ సంస్థ అయిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ (PNGRB) సుమారు 1,800 కిలోమీటర్ల పొడవైన ఎల్‌పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.7,000 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ఎల్‌పీజీ రవాణా వ్యవస్థను వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇంధన సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు ఈ మౌలిక సదుపాయాలు కీలకంగా మారనున్నాయి.

