Last Updated:
Bengaluru Lodge Murder: బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబళ్లాపుర పట్టణంలో సమృద్ధి హోటల్ పైన ఉన్న ఒక లాడ్జిలో 23 ఏళ్ల విద్య అనే యువతి హత్యకు గురైంది. ఐడీ కార్డు ట్యాగ్‌తో గొంతుకు ఉరిలా వేసి చంపేశారు.
Bengaluru Lodge Murder: అడ్డుతొలగించుకోవాలనే ఆలోచన వస్తే చాలు ఎంతటి కిరాతకానికైనా పాల్పడుతున్నారు. భార్య నచ్చకపోతే భర్త..భర్తపై కోపంతో భార్య అత్యంత దారుణంగా హతమార్చుతున్న సంఘటనలు దక్షిణాది రాష్ట్రాల్లో పెరిగిపోతున్నాయి. తాజాగా కర్నాటక రాష్ట్రం బెంగళూరు గ్రామీణ జిల్లాలోని దొడ్డబళ్లాపుర పట్టణంలో సమృద్ధి హోటల్ పైన ఉన్న ఒక లాడ్జిలో 23 ఏళ్ల విద్య అనే యువతి హత్యకు గురైంది. ఐడీ కార్డు ట్యాగ్‌తో గొంతుకు ఉరిలా వేసి చంపేశారు. బుధవారం నాడు జరిగిన ఈ మర్డర్ కేసులో పోలీసులు మిస్టరీ చేధించారు. నిందితుడు ఆమె భర్తలేనని తేల్చారు. పరారీలో ఉన్నవిద్య భర్త ఆనంద్ కోసం గాలిస్తున్నారు. అయితే కట్టుకున్న భార్యను ఎందుకు హతమార్చాడు..? ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపురలోని సమృద్ధి హోటల్ పైన ఉన్న ఒక లాడ్జిలో 23 ఏళ్ల యువతి హత్యకు గురైంది. లాడ్జీ యజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరించారు. మరణించిన మహిళ విద్యగా గుర్తించారు. ఆమె గౌరీబిదనూరు తాలూకాలోని నాగరగెరె గ్రామానికి చెందినట్లుగా తేల్చారు. అయితే బుధవారం విద్య తన భర్య ఆనంద్ తో కలిసి లాడ్జీలోకి రావడం సీసీ ఫుటేజీలో రికార్డైంది. అయితే లాడ్జీలోని గదిలో చనిపోయిన తర్వాత ఆనంద్ కనిపించకుండా పోయాడని పోలీసులు తేల్చారు.
A 23-year-old woman was found dead at a lodge above Samruddhi Hotel in Doddaballapura town of Bengaluru Rural district on Wednesday.
The deceased has been identified as Vidya, a resident of Nagaragere village in Gauribidanur taluk. Her husband, Anand, is reportedly missing… https://t.co/bbzG2QRHVN pic.twitter.com/COO6N9tG6W— Hate Detector 🔍 (@HateDetectors) September 17, 2026
ఘటన స్థలంలో పోలీసులు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యను ఐడి (ID) కార్డ్ ట్యాగ్‌తో గొంతు నులిమి చంపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం ఆమె భర్త ఆమె మొబైల్ ఫోన్‌ను తీసుకుని లాడ్జి నుండి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఆమె మరణానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులను పోలీసులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. లాడ్జీలో భార్య శవాన్ని వదిలి పారిపోయిన ఆనంద్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
మృతురాలు విద్య , ఆనంద్ సుమారు నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్లకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ దంపతులు దొడ్డబళ్లాపురంలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆనంద్ ముడుగెరె గ్రామానికి చెందినవాడు. గత ఆరు నెలలుగా ఈ దంపతుల మధ్య వైవాహిక విభేదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం, విద్య తన భర్తను వదిలి బెంగళూరులోని ఒక ‘పేయింగ్ గెస్ట్’ (PG) వసతి గృహానికి వెళ్లిపోయింది. ఆమె కనిపించకుండా పోయిన తర్వాత ఆనంద్ దొడ్డబళ్లాపుర మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విద్య ఆచూకీని కనుగొని, సుమారు 20 రోజుల క్రితం వారికి కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి కలిపి పంపారని పోలీసు వర్గాలు తెలిపాయి.
కౌన్సెలింగ్ తర్వాత ఆ దంపతులు మళ్లీ సంప్రదింపులు జరిపారని సమాచారం. బుధవారం నాడు ఆనంద్ విద్యను ఆ లాడ్జికి తీసుకువచ్చాడు, ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. దొడ్డబళ్లాపుర టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు విద్య మరణానికి సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ఆనంద్ కోసం గాలిస్తున్నారు. పోస్ట్-మార్టం నివేదిక వచ్చిన తర్వాత మరణానికి గల ఖచ్చితమైన కారణం నిర్ధారించబడుతుంది. కొనసాగుతున్న దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

