దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు వరుస కట్టాయి. అయితే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఫస్ట్ సక్సెస్ దొరికింది మాత్రం టాలీవుడ్లోనే. 2004లో వచ్చిన మల్లీశ్వరి మూవీతో ఈ బ్యూటీ హిట్ ట్రాక్ ఎక్కింది. ‘మైనే ప్యార్ క్యుం కియా’ (2005) సినిమాతో తొలి బాలీవుడ్ హిట్‌ని కైవసం చేసుకుంది. నమస్తే లండన్ (2007), రేస్ (2008), రాజ్ నీతి (2010), జిందగీ నా మిలేగీ దోబారా (2011), ఏక్ థా టైగర్ (2012), ధూమ్ 3 (2013) వంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించింది.

