ప్రభన్యూస్

Kaka Movie: చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో… ఇదెక్కడి మాస్‌రా మామ.. థియేటర్‌లో ఒక్కొక్కరికి పూనకాలే! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు.

News18
News18

సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా.. నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా సాగుతుంది.

అలా వచ్చే ఏడాది సంక్రాంతిపై ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకుంది కాకా మూవీ. మెగాస్టార్ హీరోగా, బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందట. అయితే.. ఆ రోల్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుందని సమాచారం. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపిస్తారా? చిరంజీవితో కలిసి స్క్రీన్‌పై ఎలాంటి సందడి చేయనున్నారు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే అనిల్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే. ఈ విషయంలో స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరోవైపు ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తయిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, డిసెంబర్ మొదటి వారం నాటికి చిత్రీకరణను ముగించాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారట. సంక్రాంతి విడుదలను దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ ఇమేజ్‌ను బాబీ తెరపై చూపించిన తీరు సినిమాకు మంచి విజయాన్ని అందించింది. దీంతో ‘కాకా’లోనూ ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 2:11 pm Digital Edition : Prabhanews
Kaka Movie: చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో… ఇదెక్కడి మాస్‌రా మామ.. థియేటర్‌లో ఒక్కొక్కరికి పూనకాలే! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 25, 2026 2:03 PM ISTసంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు.News18సంక్రాంతి పండగను సినిమా పండగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఈ పండగ సీజన్‌లో రిలీజైన సినిమాలకు టాక్‌ కాస్త అటు ఇటుగా వచ్చినా సరే కమర్షియల్‌గా సేఫ్‌ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయి. అందుకే బడా స్టార్లు సైతం సంక్రాంతిని టార్గెట్‌గా పెట్టుకుని సినిమాలు చేస్తుంటారు. ప్రతీ సంక్రాంతి లాగే ఈ సంక్రాంతికి కూడా నువ్వా.. నేనా అనే రేంజ్‌లో పోటీ రసవత్తరంగా సాగుతుంది.అలా వచ్చే ఏడాది సంక్రాంతిపై ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకుంది కాకా మూవీ. మెగాస్టార్ హీరోగా, బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ మూవీలో ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందట. అయితే.. ఆ రోల్ ఇంపాక్ట్ మాత్రం చాలా ఉంటుందని సమాచారం. కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఆయన కనిపిస్తారా? చిరంజీవితో కలిసి స్క్రీన్‌పై ఎలాంటి సందడి చేయనున్నారు? అనే విషయాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అయితే అనిల్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇది ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే. ఈ విషయంలో స్పష్టత రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.మరోవైపు ‘కాకా’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే దాదాపు 85 శాతం షూటింగ్ పూర్తయిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి, డిసెంబర్ మొదటి వారం నాటికి చిత్రీకరణను ముగించాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారట. సంక్రాంతి విడుదలను దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. గతంలో చిరంజీవి, బాబీ కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరంజీవి కామెడీ టైమింగ్, మాస్ ఇమేజ్‌ను బాబీ తెరపై చూపించిన తీరు సినిమాకు మంచి విజయాన్ని అందించింది. దీంతో ‘కాకా’లోనూ ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది.మరింత చదవండి

Source link