ప్రభన్యూస్

Bigg Boss Telugu 10: త్రిగుణ్‌కు జైలు శిక్ష.. రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్.. బిగ్‌బాస్‌లో నాగార్జున సంచలన నిర్ణయాలు! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరోసారి హౌస్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పడం, త్రిగుణ్‌కు నాగార్జున జైలు శిక్ష విధించడం, రోహిత్‌కు కెప్టెన్సీ అవకాశాలను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.

News18
News18

బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరోసారి హౌస్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పడం, త్రిగుణ్‌కు నాగార్జున జైలు శిక్ష విధించడం, రోహిత్‌కు కెప్టెన్సీ అవకాశాలను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా రోహిత్‌కు విధించిన శిక్ష అతడిని తీవ్రంగా కలచివేసింది.

ఎపిసోడ్‌లో ముందుగా షాలిని వ్యవహారంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లోకి షాలిని తిరిగి రావడం ఇష్టమేనా అని రామ్ ప్రసాద్‌ను ప్రశ్నించగా, తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశాడు. షాలినికి ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినా, ఆమె ప్రవర్తనలో ఆశించిన మార్పు కనిపించలేదని అభిప్రాయపడ్డాడు. దీంతో షాలిని తీవ్రంగా బాధపడింది. బ్రేక్ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ, హౌస్‌లో అందరూ తననే తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు ఇంట్లో ఉండాలని లేదని చెప్పడంతో రోహిత్, శ్వేత ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

షాలిని బాధకు కారణం తెలుసుకున్న నాగార్జున ఆమెతో మాట్లాడారు. అందరూ తననే తప్పుబడుతున్నారని చెప్పడం కంటే, తన ప్రవర్తనలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని ఆలోచించుకోవాలని సూచించారు. అనంతరం దక్షితో జరిగిన గొడవ, దేబ్జానీతో వివాదం, బిగ్‌బాస్ నుంచి వచ్చిన హెచ్చరికలకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ షాలిని ప్రవర్తనలో మార్పు రాలేదని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో షాలిని తన తప్పు ఉంటే హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పింది.

వెంటనే నాగార్జున హౌస్ గేట్లు తెరిపించడంతో షాలిని నిజంగానే బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే రోహిత్‌తో పాటు ఇతర ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని, హౌస్‌లోనే ఉండి తనను తాను నిరూపించుకోవాలని నచ్చజెప్పారు. దీంతో షాలిని తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెబుతూ నాగార్జునకు క్షమాపణలు చెప్పింది.

మరోవైపు రోహిత్‌తో వాగ్వాదం సందర్భంగా త్రిగుణ్ ఉపయోగించిన అభ్యంతరకరమైన మాటలపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. కోపంలో ఉన్నా సరే, ఇతరులను వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్రిగుణ్‌కు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడికి ఊహించని షాక్ తగిలింది.

ఇక రోహిత్ వ్యవహారంపై నాగార్జున మరింత తీవ్రంగా స్పందించారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం, అనుచితంగా ప్రవర్తించడం ఆపడం లేదని మందలించారు. శిక్షలో భాగంగా రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అంతేకాకుండా, హౌస్‌లో ఉన్నన్ని రోజులు కెప్టెన్ అయ్యే అవకాశంతో పాటు కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచే అవకాశాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ నిర్ణయంతో రోహిత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మోకాళ్లపై కూర్చుని నాగార్జునను వేడుకుంటూ, ఈ శిక్ష వల్ల తన ఆట మొత్తం దెబ్బతింటుందని, దయచేసి శిక్షను తగ్గించాలని కోరాడు. అనంతరం నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరకు రోహిత్‌కు విధించిన శిక్షను రెండు వారాలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడికి కొంత ఊరట లభించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో షాలిని కన్నీళ్లు, త్రిగుణ్‌కు జైలు శిక్ష, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో పాటు కెప్టెన్సీపై ఆంక్షలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలు కంటెస్టెంట్ల ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 25 October 2026, 10:58 am Digital Edition : Prabhanews
Bigg Boss Telugu 10: త్రిగుణ్‌కు జైలు శిక్ష.. రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్.. బిగ్‌బాస్‌లో నాగార్జున సంచలన నిర్ణయాలు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 25, 2026 10:34 AM ISTబిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరోసారి హౌస్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పడం, త్రిగుణ్‌కు నాగార్జున జైలు శిక్ష విధించడం, రోహిత్‌కు కెప్టెన్సీ అవకాశాలను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి.News18బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌లో మరోసారి హౌస్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. కంటెస్టెంట్ షాలిని కన్నీళ్లు పెట్టుకుంటూ హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పడం, త్రిగుణ్‌కు నాగార్జున జైలు శిక్ష విధించడం, రోహిత్‌కు కెప్టెన్సీ అవకాశాలను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకోవడం ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచాయి. ఇంటి సభ్యుల ప్రవర్తనపై నాగార్జున తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ముఖ్యంగా రోహిత్‌కు విధించిన శిక్ష అతడిని తీవ్రంగా కలచివేసింది.ఎపిసోడ్‌లో ముందుగా షాలిని వ్యవహారంపై నాగార్జున స్పందించారు. హౌస్‌లోకి షాలిని తిరిగి రావడం ఇష్టమేనా అని రామ్ ప్రసాద్‌ను ప్రశ్నించగా, తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశాడు. షాలినికి ఇప్పటికే రెండో అవకాశం ఇచ్చినా, ఆమె ప్రవర్తనలో ఆశించిన మార్పు కనిపించలేదని అభిప్రాయపడ్డాడు. దీంతో షాలిని తీవ్రంగా బాధపడింది. బ్రేక్ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ, హౌస్‌లో అందరూ తననే తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తనకు ఇంట్లో ఉండాలని లేదని చెప్పడంతో రోహిత్, శ్వేత ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.షాలిని బాధకు కారణం తెలుసుకున్న నాగార్జున ఆమెతో మాట్లాడారు. అందరూ తననే తప్పుబడుతున్నారని చెప్పడం కంటే, తన ప్రవర్తనలో ఏమైనా తప్పులు ఉన్నాయా అని ఆలోచించుకోవాలని సూచించారు. అనంతరం దక్షితో జరిగిన గొడవ, దేబ్జానీతో వివాదం, బిగ్‌బాస్ నుంచి వచ్చిన హెచ్చరికలకు సంబంధించిన దృశ్యాలను చూపించారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ షాలిని ప్రవర్తనలో మార్పు రాలేదని నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. దీంతో షాలిని తన తప్పు ఉంటే హౌస్ నుంచి వెళ్లిపోతానని చెప్పింది.వెంటనే నాగార్జున హౌస్ గేట్లు తెరిపించడంతో షాలిని నిజంగానే బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే రోహిత్‌తో పాటు ఇతర ఇంటి సభ్యులు ఆమెను అడ్డుకుని, హౌస్‌లోనే ఉండి తనను తాను నిరూపించుకోవాలని నచ్చజెప్పారు. దీంతో షాలిని తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెబుతూ నాగార్జునకు క్షమాపణలు చెప్పింది.మరోవైపు రోహిత్‌తో వాగ్వాదం సందర్భంగా త్రిగుణ్ ఉపయోగించిన అభ్యంతరకరమైన మాటలపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. కోపంలో ఉన్నా సరే, ఇతరులను వ్యక్తిగతంగా దూషించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో త్రిగుణ్‌కు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడికి ఊహించని షాక్ తగిలింది.ఇక రోహిత్ వ్యవహారంపై నాగార్జున మరింత తీవ్రంగా స్పందించారు. గతంలో పలుమార్లు హెచ్చరించినప్పటికీ, అసభ్యకరమైన పదజాలం ఉపయోగించడం, అనుచితంగా ప్రవర్తించడం ఆపడం లేదని మందలించారు. శిక్షలో భాగంగా రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అంతేకాకుండా, హౌస్‌లో ఉన్నన్ని రోజులు కెప్టెన్ అయ్యే అవకాశంతో పాటు కెప్టెన్సీ పోటీదారుడిగా నిలిచే అవకాశాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.ఈ నిర్ణయంతో రోహిత్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మోకాళ్లపై కూర్చుని నాగార్జునను వేడుకుంటూ, ఈ శిక్ష వల్ల తన ఆట మొత్తం దెబ్బతింటుందని, దయచేసి శిక్షను తగ్గించాలని కోరాడు. అనంతరం నాగార్జున ఇంటి సభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరకు రోహిత్‌కు విధించిన శిక్షను రెండు వారాలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అతడికి కొంత ఊరట లభించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో షాలిని కన్నీళ్లు, త్రిగుణ్‌కు జైలు శిక్ష, రోహిత్‌కు బ్లాక్ బ్యాడ్జ్‌తో పాటు కెప్టెన్సీపై ఆంక్షలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పరిణామాలు కంటెస్టెంట్ల ఆటపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.మరింత చదవండి

Source link