GK Questions: మన దేశంలో వేసవి, వర్షాకాలం సీజన్లలో విరివిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు ఒకటి. పులుపు, వగరు, తీపి కలగలిసిన అద్భుతమైన రుచితో ఉండే ఈ పండ్లను తినడానికి చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచడానికి నేరేడు పండు, దాని గింజల పొడి ఒక సంజీవనిలా పనిచేస్తాయి.

