మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత ప్రాంతాలు ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలు, సంస్కృతికి ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలను సౌకర్యంగా సందర్శించే అవకాశం కల్పించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి “షవర్స్ ఆఫ్ సహ్యాద్రి” ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీలో కొల్హాపూర్, మహాబలేశ్వర్, పంచగని, పుణే, భీమాశంకర్ జ్యోతిర్లింగ ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను 6 రోజుల్లో సందర్శించవచ్చు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ఇందులో విమాన ప్రయాణం, వసతి, భోజనం, సందర్శనా ప్రయాణాలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి. మహారాష్ట్రలోని ఆధ్యాత్మిక, ప్రకృతి అందాలను సులభంగా ఆస్వాదించాలనుకునే ప్రయాణికులకు ఇది ఉపయోగకరమైన ప్యాకేజీగా ఉంటుంది. ఈ యాత్ర హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి 2026 సెప్టెంబర్ 27న ప్రారంభమవుతుంది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఉదయం 11:20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు కొల్హాపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం 2026 అక్టోబర్ 2న పుణే నుంచి హైదరాబాద్‌కు 6E 103 విమానంలో ఉంటుంది. ఈ విమానం పుణే నుంచి రాత్రి 10:25 గంటలకు బయలుదేరి రాత్రి 11:40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)

